వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ను సంపూర్ణేష్ తో పోల్చిన మంత్రి అనిల్-పవరూ లేదూ, స్టారూ లేడూ-షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య సాగుతున్న పోరులో తాజాగా జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసేందుకే ఆన్ లైన్ సినిమా టికెట్లను తీసుకొస్తోందంటూ పవన్ చేసిన విమర్శలపై మంత్రులు ఇవాళ ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు మంత్రి అనిల్ దీటుగా బదులిచ్చారు.

పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రుల ఫైర్

పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రుల ఫైర్

ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వమే అధికారికంగా ఓ పోర్టల్ తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడంపై చిత్ర పరిశ్రమలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ విడుదల సందర్భంగా అదనపు షోలు వేసుకోకుండా అడ్డుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ల ద్వారా చిత్ర పరిశ్రమలో తమకు నచ్చనివారిని టార్గెట్ చేయబోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డారు. దీంతో మంత్రులు ఇవాళ ఆయనపై కౌంటర్ అటాక్ ప్రారంభించారు.

పవన్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్

పవన్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్

ఆన్ లైన్ టికెట్లను ప్రభుత్వమే విక్రయించాలన్న నిర్ణయంపై నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ మండిపడ్డారు. ఆన్ లైన్ పోర్టల్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ ను ఆయన ప్రశ్నించారు. దాని వల్ల జరిగే నష్టమేంటని నిలదీశారు.

ఆన్ లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. దీనిపై పవన్ రచ్చ చేయడం సరికాదన్నారు.

 పవన్ అయినా సంపూర్ణేశ్ బాబు అయినా ఒక్కటే

పవన్ అయినా సంపూర్ణేశ్ బాబు అయినా ఒక్కటే

ఆన్ లైన్ టికెట్లను ప్రభుత్వం పోర్టల్ ద్వారా విక్రయించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ పై మంత్రి అనిల్ నిశిత విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేని ఆయన గుర్తు చేశారు. జవాబుదారీతనం తీసుకురావాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని ఆయన అన్నారు.

పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్ తీసుకొస్తున్నామని, అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమని మంత్రి అనిల్ తెలిపారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని, ఇది ఎంతవరకు సబబని మంత్రి ప్రశ్నించారు.

పవన్ కోసం టాలీవుడ్ టార్గెట్ నిజం కాదు

పవన్ కోసం టాలీవుడ్ టార్గెట్ నిజం కాదు

నా ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదని మంత్రి అనిల్ తెలిపారు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ మాత్రమేనన్నారు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ..జగన్ చిత్ర పరిశ్రమనoతా ఇబ్బంది పెడుతున్నాడని ఒక ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదని మంత్రి అనిల్ తెలిపారు.

రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని అనిల్ ఆక్షేపించారు. గతంలో ప్రభుత్వ తీరును మారుస్తాను.. నేను రోడ్డు కొస్తే మనిషిని కాదు.. బెండు తీస్తాం.. అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామని, ఇప్పుడు రెండు జెడ్పీటీసీలు, ఒక మండలం గెలిచి మా అడుగులు అంటున్నాడు పవన్ కళ్యాణ్ అని మంత్రి అనిల్ ఆక్షేపించారు. ఇక్కడ నుంచి పైకెళ్ళేలోపల పార్టీ చాపచుట్టేయడం ఖాయమన్నారు.

English summary
ap minister anil kumar yadav on today launches counter attack on janasena chief pawan kalyan over his remarks on jagan government in online tickets issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X