వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: కేంద్రం ఇచ్చేది 90 లక్షల మందికే, మరి మిగతా వారి సంగతేంటీ, రూ.వెయ్యి సాయంపై మంత్రి బొత్స

|
Google Oneindia TeluguNews

రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కేంద్రం జన్ ధన్ ఖాతాల్లో 500 వేస్తోందని వివరించారు. ఒక వ్యక్తికి 5 కిలోల కేజీల బియ్యం, పప్పు ఇస్తోందన్నారు. ఆ లెక్కన రాష్ట్రంలో రేషన్ కేవలం 90 లక్షల మందికే అందుతుందని వివరించారు. మరి మిగతా యాబై లక్షల మంది సంగతేంటి అని ప్రశ్నించారు. వారికి రేషన్, నగదు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నిలదీశారు. ఇవేమీ తెలియని బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ప్రకటించకముందే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి వెయ్యి రూపాయల సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు.

1.42 కోట్ల మంది..

1.42 కోట్ల మంది..

ఏపీలో మొత్తం 1.42 కోట్ల బియ్యం కార్డులు ఉండగా.. ప్రతినెలా సగటున 1.32 కోట్ల మంది బియ్యం తీసుకుంటున్నారని బొత్స వివరించారు. కార్డుల డుప్లికేషన్, ఇతర కారణాలతో పదిలక్షల మంది వరకు బియ్యం తీసుకోవడం లేదన్నారు. వెయ్యి రూపాయల సాయంను మాత్రం ఎక్కవమందే తీసుకుంటున్నారని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలను గ్రామస్థాయిలోనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. రైతులు బెంగ పెట్టుకొవద్దని స్పష్టంచేశారు. ఆక్వాకల్చర్ రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో కొనుగోళ్లు ప్రారంభించమన్నారు. 40 శాతం కొనుగోళ్లు జరిగాయని చెప్పారు.

చంద్రబాబుపై ఫైర్..

చంద్రబాబుపై ఫైర్..


రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుంటే స్థానిక ఎన్నికల కోసం ఓట్లు అడుగుతారు అని అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు నాయుడుపై బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. వాస్తవం చెప్పాల్సింది పోయి.. రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

ముందే ప్రకటించాం..

ముందే ప్రకటించాం..


ప్రజల బాగోగులు తెలుసుకోకుండా మిన్నకుండిపోవడమే గాక.. అవాకులు చెవాకులు పేలతారా అని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ అవసరం లేదని చెప్పారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించక ముందే వెయ్యి రూపాయల సాయం ప్రకటించారని గుర్తుచేశారు. కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వం కార్యాచరణను రూపొందించి.. అమలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో వార్డు, గ్రామవాలంటీర్లు, ఆశావర్కర్లు, ఎఎన్ఎంలు, వైద్యులు, టీచర్లను దీనిలో భాగస్వాములను చేశామని వివరించారు

English summary
andhra pradesh minister botsa satya narayana angry on opposition parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X