వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌ండ‌లి నుండి మంత్రి వాకౌట్‌: ఆయ‌న దారిలోనే ప్ర‌తిప‌క్షం: చ‌ట్ట‌స‌భ‌ల్లో అరుదైన సన్నివేశం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌మండ‌లి చరిత్ర‌లో ఎప్ప‌డూ జ‌ర‌గ‌ని ఒక అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. చ‌ట్ట స‌భ‌ల నుండి ప్ర‌భుత్వ తీరు నిర‌సిస్తూ ప్ర‌తిపక్షం వాకౌట్ చేయ‌టం సాధార‌ణం. అయితే, ఏపీ శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష తీరుకు నిర‌స‌న‌గా మంత్రి వాకౌట్ చేసిన ఘ‌ట‌న ఇది. మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం మంత్రి క‌న్న‌బాబు త‌న సోద‌రుడి మృతి కార‌ణంగా స‌మావేశాల‌కు దూరంగా ఉండ‌టంతో ఆయ‌న బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. శాస‌న మండ లి లో కరువు పైన చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. ఆ స‌మ‌యంలో స‌మాధానం చెబుతూనే..ప్ర‌తిప‌క్షం మాట్లాడు తుండ‌గానే..మంత్రి బొత్సా వాకౌట్ చేసారు. ఆయ‌న్ను అనుస‌రిస్తూ ప్ర‌తిప‌క్ష సైతం బ‌య‌ట‌కు వెళ్లిపోయింది.

Recommended Video

ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా-జగన్

మండ‌లి నుండి మంత్రి వాకౌట్‌..
చ‌ట్ట స‌భ‌ల్లో సాధార‌ణంగా ప్ర‌తిపక్షం నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టం...వాకౌట్ చేస్తుంటారు. మ‌రి అదే ప‌ని అధికార పక్షంలోని వారు చేస్తే..అందునా ఏకంగా మంత్రే వాకౌట్ చేస్తే..అందరూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇటువ‌టి స‌న్నివేశ‌మే ఏపీ శాస‌న మండ‌లిలో చోటు చేసుకుంది. శాస‌న మండ‌లిలో క‌రువు..అనావృష్టి ప‌రిస్థితుల పైన చ‌ర్చించాల‌ని ప్రతిపక్షం ప‌ట్టు బ‌ట్టింది. దీని పైన మంత్రి బొత్సా జోక్యం చేసుకుని క‌రువు పైన అన్ని జిల్లాల నుండి స‌మ‌గ్ర నివేదిక‌ల‌ను తెప్పిస్తు న్నామ‌ని..త్వ‌ర‌లోనే పూర్తి స‌మాచారం అందుబాటులో ఉంచుతామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అతి త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని మంత్రి చెప్పుకొచ్చారు. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు ఎవ‌రు చేసుకున్నారు..ఎటువంటి ప‌రి స్థితుల్లో చేసుకున్నార‌నే దాని పైన నివేదిక సిద్దం చేస్తున్నామ‌న్నారు. గ‌త అయిదు సంవ‌త్స‌రాల స‌మ‌యంలో నాటి ప్ర‌భుత్వం రైతుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని మంత్రి బొత్సా విమ‌ర్శించారు.

AP Minister Botsa Satyanarayana walk out from Legislative council.This is the first time in Council

చ‌ర్చ జ‌రుగుతుండానే మంత్రి వాకౌట్‌...
ఇలా చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలోనే స‌డ‌న్‌గా మంత్రి బొత్సా స‌భ నుండి వెళ్లిపోయారు. వాస్త‌వంగా క‌రువు మీద చ‌ర్చ వ్య‌వ‌సాయ శాఖా మంత్రి స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, మంత్రి క‌న్న‌బాబుకు సోద‌ర వియోగం కార‌ణంగా ఆయ‌న స‌మావేశాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో..వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌టం ద‌గ్గ‌ర నుండి స‌మాధానాలు చెప్పే బాధ్య‌త బొత్సా తీసుకున్నారు. అందులో భాగంగానే మండ‌లిలో చ‌ర్చ‌కు స‌మాధానం ఇచ్చారు. బొత్స మాట్లా డుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, చర్చ కొనసాగుతుండగానే సభ నుంచి బొత్స వెళ్లిపోయారు. మంత్రి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో... టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు.
బఅయితే ఈ వాకౌట్ వ్యవహారంపై బొత్స ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఈ ర‌కంగా మంత్రి వాకౌట్ చేయ టం..ఆయ‌న తీరుతో ప్ర‌తిపక్షం వాకౌట్ చేయ‌టం మాత్రం ఇదే తొలి సారిగా చెబుతున్నారు.

English summary
AP Minister Botsa Satyanarayana walk out from Legislative council. When discussion going on Drought minister suddenly quit from council Hall. Then opposition also followed him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X