• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కరోనా: చంద్రబాబు ముఖ్యమంత్రిలా.. మంత్రి బుగ్గన అనూహ్య వ్యాఖ్యలు.. కేసీఆర్, కన్నాను వదల్లేదు..

|

కరోనా వైరస్ నియంత్రణలో దేశంలోనే బెస్ట్ రాష్ట్రంగా కొనసాగుతోన్న కేరళ కంటే, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తమ విధానాలు అమలవుతున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అయినాసరే, ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు తక్కువ టెస్టులు చేస్తూ తక్కువ కేసులు చూపిస్తోంటే, ఏపీ సర్కారు మాత్రం ప్రతి అంశంలో పారదర్శకత పాటిస్తున్నదన్నారు. కొవిడ్-19 సంబంధిత అంశాలపై శుక్రవారం విజయవాడలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన బుగ్గన పలు ఆసక్తికర, అనూహ్య కామెంట్లు చేశారు. ఆయనేమన్నారంటే..

జగన్ చెప్పిందే నిజమైంది..

జగన్ చెప్పిందే నిజమైంది..

కరోనా వైరస్ తో సహజీవనం తప్పదని సీఎం జగన్ ప్రజలకు నిజాలు చెప్పారు. అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ దాకా ధృవీకరించారు. లాక్ డౌన్ ఎత్తివేతపై జగన్ అభిప్రాయాలు నూరుశాతం కరెక్టేనని రఘురాం రాజన్, నారాయణమూర్తిలాంటి దిగ్గజాల వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. కరోనాపై ఏపీ సర్కారుకు మొదటి నుంచీ స్పష్టమైన స్టాండ్ ఉంది కాబట్టే, మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రజలకు ధైర్యమిస్తూ, లాక్ డౌన్ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, వైద్యరంగాన్ని బలోపేతం చేశాం. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం సీఎం జనగ్ తీరు తప్పని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వీళ్లను చూశాక తమిళనాడు తత్వవేత్త తిరువాళ్వార్ రాసిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి..‘‘ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉంటారో వాళ్లంతా, ఫలించని అంశాల్ని చాలా విలువైనవి భావిస్తూ, తద్వారా వాళ్ల జీవితాలను విలువలేకుండా బాధాకరంగా తయారు చేసుకుంటారు'' అని ఆయన చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే కన్ఫ్యూజింగ్ రకం. ఆయనకుగానీ, ఆ పార్టీకిగానీ దేనిపైనా ఒక అభిప్రాయమంటూ స్థిరంగా ఉండదు.

చంద్రబాబే సీఎంలా..

చంద్రబాబే సీఎంలా..

జగన్, రఘురాం రాజన్, నారాయణమూర్తిలాంటోళ్లతోపాటు ప్రంపంచంలో ఎవరికీ తెలివిలేదు.. నా ఒక్కడికే ఉందని చంద్రబాబు నమ్ముతారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ఆయన.. కొవిడ్ మొదలైన మొదటి రోజే కామెంట్లు చేస్తాడు, కరోనాపై పోరు అనేది మారథాన్ లాంటిదని తెలిసినా, రెండు అడుగులకే విమర్శలు మొదలుపెడతాడు. చంద్రబాబు ఎంత విచిత్రంగా వ్యవహరిస్తారంటే, బయటి దేశాల నుంచి వచ్చివాళ్లెవరైనా ఆ తీరును చూసి చంద్రబాబే ముఖ్యమంత్రి అనుకుంటారు. ఎందుకంటే పొద్దంతా కరోనాపై రివ్యూలు చేసే ఏకైక మనిషి ఆయనే. ఇంతకీ ఎవరితో రివ్యూలు చేస్తారు? డాక్టర్లు, మున్సిపల్ వర్కర్లతో కాదు.. ఆయా జిల్లాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కరోనాపై రివ్యూలు చేయడం, వాటిని మీడియాలో 24 గంటలూ ప్రసారం చేస్తుండటంతో కొత్తవాళ్లకు అలంటి భ్రమలే కలుగుతాయి. ఏపీలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలంటున్నారు.. ఆయనేమో హైదరాబాద్ లో దాక్కుంటారు. చెప్పడం.. ఆల్ పార్టీ మీటింగ్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర పెట్టుకుందామా?

కుటుంబరావు ఒక్కడే..

కుటుంబరావు ఒక్కడే..

చంద్రబాబు జూమ్ యాప్ లో, లోకేశ్ బాబు ట్విటర్ లో తెగహడావుడి చేస్తున్నారు. ఆదాయం పెరిగిందని, కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తున్నామని అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, టీడీపీలో కుటుంబరావు ఒక్కరు తప్ప యనమల రామృష్ణుడుకు కూడా ఆర్థిక అంశాలమీద పట్టులేదు. గతేడాది 1.65వేల కోట్లు ఆదాయం వస్తే, ఈసారి ఇంచుమించు 5 వేల కోట్లు ఎక్కువ వచ్చాయి. కాంట్రాక్టుల చెల్లింపుల్లోనూ కరోనాకు సంబంధించినవే ఎక్కువ. కరోనాపై టీడీపీ స్టాండ్ చూస్తుంటే హెలికాప్టర్ కథ గుర్తొస్తుంది. చంద్రబాబు తొందరపాటున పారాచూట్ అనుకుని, పిల్లాడి స్కూల్ బ్యాగ్ తో హెలికాప్టర్ నుంచి దూకేసిన చందంగా వ్యవహరిస్తున్నారు.

ఏపీనే టాప్..

ఏపీనే టాప్..

గత నెల రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల ముందుపెట్టాం. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క ఏపీలోనే లక్షపైచిలుకు మందికి టెస్టులు నిర్వహించాం. ఏపీ జనాభా 5.34 కోట్ల మందికిగానూ ప్రతి 10 లక్షల మందిలో దాదాపు 2వేల మందికి కరోనా పరీక్షలు చేశాం. ఏపీ తర్వాత తమిళనాడు 1500 టెస్టులు, రాజస్థాన్ 1344, మహారాష్ట్ర 1056 టెస్టులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీన్నిబట్టే ఏపీ సర్కారు ఎంత చిత్తశుద్ధితో, బాధ్యతతో వ్యవహరించిందో అర్థంమవుతోంది. ఇది తెలిసినా, కొంత మంది ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేసీఆర్ సర్కారుపై పరోక్ష విమర్శలు..

కేసీఆర్ సర్కారుపై పరోక్ష విమర్శలు..

కరోనా టెస్టుల్లో పాజిటివిటీ రేటు ప్రపంచవ్యాప్తంగా 11 శాతంగా, ఇండియా మొత్తంలో 4.12 శాతంకాగా ఉండగా, ఏపీలో మాత్రం 1.5 శాతమే ఉంది. ఇక్కడ కూడా కొందరు ఏపీకి పక్క రాష్ట్రాలతో పోలిక పెడుతున్నారు, అసలు ఏపీలో చేసినన్ని టెస్టులు ఎక్కడజరుగుతున్నాయి గనుక? తక్కువ టెస్టులు చేసి, తక్కువ కేసులున్నాయని చెప్పుకోవడం పరిష్కారం కాదు. ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే, బాధ్యతగల వ్యక్తులు కూడా రాష్ట్రాల పేర్లు చెప్పి, అక్కడ కరోనా ప్రభావం తక్కువుందని చెబుతున్నారు. కానీ అసలు టెస్టింగ్స్ ఎన్ని జరుపుతున్నారో ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారు. ఇది కచ్చితంగా ప్రమాదకర ప్రాపగండానే.

మరణాలు, పాజిటివిటీ రేటు ఇలా..

మరణాలు, పాజిటివిటీ రేటు ఇలా..

మరణాల రేటు ప్రపంచ వ్యాప్తంగా 6.88 శాతం ఉంటే, ఇండియాలో 3.17 శాతం, ఏపీలో 2.4 శాతం ఉంది. దీని అర్థం.. పాజిటివ్ గా తేలిన పేషెంట్లకు ప్రాపర్ మెడికేషన్, ఫుడ్ ఇస్తూ బాగా చూసుకోవడం వల్లే మరణాలు తక్కువగా ఉన్నాయి. కరోనాకు సంబంధించి ఏపీలో జిల్లలను కూడా మేం కీలక విభజన చేశాం. కొన్నింటిని వెరీ హైర్కిస్క్ గా, ఇంకొన్నింటిని మోడరేట్లీ హైరిస్క్ జిల్లాలుగా పెట్టుకున్నాం. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలను వెరీ హైరిస్క్ గా పేర్కొన్నాం. అక్కడ కొవిడ్ కేసులు ఎందుకు పెరిగాయో అందరికీ తెలుసు. కొందరు అమాయకులు వేరే రాష్ట్రం వెళ్లి వైరస్ కాటుకు గురయ్యారేతప్ప, ఏపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కేసులు పెరగలేదు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించింది. ఇంతజరిగినా, పాజిటివిటీ రేటు కర్నూలులో 4.8 శాతం, గుంటూరు 3.03, కృష్ణాలో 3.24 శాతం ఉంది. అలాగే, తక్కువ రిస్క్ ఉన్న జిల్లాలైన తూర్పుగోదావరిలో 0.5, విశాఖపట్నం 0.2, శ్రీకాకుళంలో 0.09గా పాజిటివిటీ రేటు ఉంది.

ఏపీ గర్వపడుతోంది..

ఏపీ గర్వపడుతోంది..

గత 24 గంటల్లో 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. అవును, ఏపీలో ఎక్కువ టెస్టులు చేస్తూ, కరోనాతో పోరాడుతోంది కాబట్టే కేసులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. దీనికి మేం గర్వపడుతున్నాం కూడా. నిజాల్ని ప్రజలముందు ఉంచుతున్నాం. అత్యవసర శాఖలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే, కొందరు మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. శుక్రవారానికి మొత్తం కేసులు 1463కాగా, అందులో 1027 యాక్టివ్ కేసులున్నాయి, ఇప్పటిదాకా 423 మంది డిశ్చార్జ్ అయ్యారంటే ఆస్పత్రుల్లో బాగా చూసుకుంటున్నారనేకదా అర్థం. రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 33గా ఉంది. అందులో ఎక్కువమంది, పెద్దవయసున్నవాళ్లు, ఇతర వ్యాధులతో ఇబ్బందిపడుతున్నవాళ్లే ఉన్నారు. పాజిటివ్ కేసులతో మరణాల సంఖ్యను పోల్చుకుంటే.. మహారాష్ట్రలో(7.7 శాతం కేసులకు 4.3 శాతం మంది చనిపోయారు. గుజరాత్ లో(కేసులు 6.8, మరణాలు 4.8), ఢిల్లీలో(7.4, 1.6), మధ్యప్రదేశ్(6.2, 5 శాతం), ఆంధ్రప్రదేశ్ లో 1.4 పాజిటివ్ కేసులుంటే 2 శాతం మంచి చనిపోయారు.

డిశ్చార్జిలు పెరిగాయంటే అర్థమేంటి?

డిశ్చార్జిలు పెరిగాయంటే అర్థమేంటి?

గత 24 గంటల్లో 82 మందిని డిశ్చార్జి చేయగా, 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఎప్పుడైనాసరే, డిశ్చార్జిల కంటే కొత్త కేసులు తక్కువగా ఉన్నాయంటే, మనం తగ్గుముఖంలో ఉన్నామని నిదర్శనం. కానీ ఈ విషయం కొందరికి అర్థం కాదు, అర్థమైనా కానట్టు నటిస్తుంటారు. ఏపీలో తొమ్మిది ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ ఉండగా, వాటిలో 19 మిషన్లు పనిచేస్తున్నాయి. అక్కడ ప్రతిరోజూ 1700 మంది పనిచేస్తున్నారు. 50 ట్రూనాట్ ల్యాబ్స్ లో 311 మిషిన్లున్నాయి వాటి ద్వారా 6500 టెస్టులు, ఐదు క్లియా ల్యాబ్స్ ద్వారా 600 టెస్టులకు ఏర్పాట్లు చేసుకున్నాం. ఇవి కాకుండా వైజాగ్, గుంటూరు, విజయవా, కాకినాడ, కర్నూలు, తిరుపతి, కడపలో వీఆర్ డీఎల్ ల్యాబ్స్ ద్వారా 1700 టెస్టులకు ఏర్పాట్లు చేసుకున్నాం. నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లోనూ కొత్త ల్యాబ్స్ ప్రారంభించబోతున్నాం. వీటిని మెచ్చుకోవాల్సిందిపోయి విమర్శిస్తుండటం బాధాకరం.

లాక్ డౌన్ ఎత్తివేతపై..

లాక్ డౌన్ ఎత్తివేతపై..

కరోనాకు సంబంధించి కేంద్రం 34 నిబంధనలు జారీచేస్తే, ఏపీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే, రైతాంగం నష్టపోకుండా మరింత డీటెయిల్డ్ గా రూల్స్ రూపొందించాం. పరిశ్రమల్లో కార్యకలాపాలకు సంబంధించి 25 పేజీల నిబంధనలు సిద్ధం చేశాం. ఏపీ మరింత బాధ్యతగా వ్యవహరించింది కాబట్టే, జిల్లాలు, మండలాలు, వార్డులను కూడా రెడ్, ఆరెంజ్ జోన్లుగా విభజించుకోగలిగాం. కొవిడ్ అడ్మినిస్ట్రేషన్ లో ముందున్న కేరళ రాష్ట్రంలో కూడా కేవలం జిల్లాల వరకే జోన్లుగా విభజించారు. కర్నూలు లాంటి జిల్లాల్లో కేసులు పెరిగినందుకు రాష్ట్ర, జిల్లాల యంత్రాంగమంతా కష్టపడి పనిచేస్తోంది. డీటెయిల్డ్ గా కాంటాక్ట్స్ ను గుర్తించి, టెస్టింగ్ చేస్తున్నాం. ఇవాళ్టికి అక్కడ 10 మంది చనిపోయారు. అందులో ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడినవాళ్లు, మిగతా వ్యాధులతో ఇబ్బందులుపడుతున్నవాళ్లే ఉన్నారు. లెక్కలు ఇలా ఉన్నప్పుడు, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. కర్నూలు కర్వ్ ప్లాట్ అవుతోంది. కేసులు పెరిగినా, అదేస్థాయిలో డిశ్చార్జిలు ఉంటాయి.

కన్నాకు సవాల్..

కన్నాకు సవాల్..

తాను డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ ద్వారా ఏపీ సర్కారు కరోనా యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు చేసిందంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణల్ని మంత్రి బుగ్గన ఖండించారు. కన్నా ఆరోపణల్లో నిజం లేదని, ఒక వేళ ఆయన తన ఆరోపణల్ని నిరూపిస్తే శనివారం ఉదయం గంటల్లోపు మంత్రి పదవికి రాజీనామా చేసేస్తానని బుగ్గన సవాలు విసిరారు. వయసు పెరిగిన కన్నా విచక్షణ మర్చిపోయి మాట్లాడటం కరెక్ట్ కాదని హితవుపలికారు.

English summary
minister buggana rajendranath reddy said that andhra pradesh is fighting well against coronavirus. he slams tdp chief chandrababu and other parties leaders for politicizing covid-19 issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X