వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్ల ముందు జైలు వూచలు కనబడేసరికి జగన్ వెళ్లి మోడీ కాళ్లపై పడ్డారు : దేవినేని ఉమా

ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని, కళ్ల ముందు జైలు వూచలు కనబడుతున్నాయి కాబట్టే కేసులు మాఫీ చేయించుకునే పనిలో పడ్డారని ఘాటుగా విమర్శించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పార్లమెంట్‌ సమావేశాలు పూర్తికాగానే ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

జగన్‌ ఎవరి కాళ్లు పట్టుకున్నా ఆయనపై ఉన్న అవినీతి కేసులు మాఫీ కాబోవని విమర్శించారు. 16 నెలలు జైల్లో గడిపిన జగన్‌ ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

AP Minister Devinani Uma critisized YSRCP Chief YS Jagan

జగన్‌ కళ్ల ముందు జైలు వూచలు కనబడుతున్నాయి కాబట్టే కేసులు మాఫీ చేయించుకునే పనిలో పడ్డారని ఘాటుగా విమర్శించారు. అగ్రి గోల్డ్‌పై అసెంబ్లీలో చర్చిద్దామంటే పారిపోయిన జగన్‌ ఇప్పుడు అదే అంశంపై ప్రధాని మోడీని కలవడం విచిత్రంగా ఉందన్నారు.

మిర్చి రైతులకు రూ.5 వేలు కేంద్రం ప్రకటించినట్లు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను కూడా రాజకీయం చేసి మాట్లాడటం ప్రతిపక్షానికి తగదని, మోడీ కాళ్లపై పడినా కేసులు మాఫీ కావని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

English summary
Andhra Pradesh Irrigation Minister Devineni Umamaheswara Rao on Wednesday said that YSRCP Chief YS Jagan politicising every issue. Now Jagan has fear of jail.. that is why he went to Delhi to touch Prime Minister Modi's feet. Jagan told that after Parliament Sessions his party MPs will resign.. but now he went to Modi for his blessings. Even with the blessings of Prime Minister also he wouldn't be saved from the cases which he is facing, said Minister Uma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X