సహనం కోల్పోయిన మంత్రి ధర్మాన ప్రసాదరావు: వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు (వీడియో)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహనం కోల్పోయారు. వైయస్సార్సీపీకి చెందిన కార్యకర్తపై ఆయన చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తే.. చెంపదెబ్బ కొడతారా? అని మండిపడుతున్నారు.

ఎనిమిదేళ్ల తర్వాత మంత్రిగా శ్రీకాకుళంకు ధర్మాన ప్రసాదరావు
వివరాల్లోకి వెళితే.. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం శ్రీకాకుళం వచ్చారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం శ్రీకాకుళంకు వచ్చారు. మళ్లీ మంత్రి పదవి చేపట్టిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న ధర్మాన ప్రసాదరావు
ఈ క్రమంలో మంత్రి ధర్మానతో కరచాలనం చేసేందుకు పార్టీ కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త మంత్రి చేతిని గట్టిగా లాగాడు. దీంతో అసౌకర్యానికి గురైన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు మంత్రి ధర్మాన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల అభిమాన కట్టిపడేసిందంటూ ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు
ఇది ఇలావుండగా, తాజాగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వయోభారం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే, ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనను ఆ పనిచేయకుండా కట్టిపడేస్తున్నాయని పేర్కొన్నారు.

కులాలు, మతాలు పనిచేయవన్న ధర్మాన
అలాగే, రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని.. ఇది మనందరం సిగ్గుపడాల్సిన విషయమని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. కులాన్ని, మతాన్ని చూసి ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. నీతి, నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం కారణంగానే తన గౌరవం మరింత పెరిగిందని చెప్పారు.