• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెచ్చిపోయిన కొడాలి-చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు-పచ్చి బూతులే

|

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. తాజాగా సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడున్నారు. ఇదే కోవలో రైతులకు అందిస్తున్న సాయంపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు మంత్రి కొడాలి నాని ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. రాయలేని భాషలో చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

 చంద్రబాబు, లోకేష్‌పై రెచ్చిపొయిన కొడాలి

చంద్రబాబు, లోకేష్‌పై రెచ్చిపొయిన కొడాలి

ఏపీలో ప్రభుత్వ విధానాలపై నిత్యం విమర్శలు చేస్తున్న విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఇవాళ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి సంక్షేమ పాలన అందించాలని సీఎం జగన్ భావిస్తున్నారని మంత్రి తెలిపారు. రైతులను మోసం చేయకుండా ఆదుకోవాలని ఆయన కష్టపడుతున్నారన్నారు. దీంతో 23 సీట్లకు పరిమితమైన తుప్పు, పప్పు గాళ్లకు ఏం చేయాలో తెలియడం లేదన్నారు.

 మనిషివా, దున్నపోతువా ?

మనిషివా, దున్నపోతువా ?

ఎవరో చనిపోతే ఈ పప్పు (లోకేష్‌) నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, మొన్న చంద్రబాబు సీఎంకు లేఖ రాశారని కొడాలి మండిపడ్డారు. రైతులకు డబ్బు చెల్లించడం లేదని మీడియాకు రిలీజ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని కొడాలి ప్రశ్నించారు. నువ్వు మనిషివా, దున్నపోతువా అంటూ చంద్రబాబుపై ఊగిపోయారు. తాను కట్టకుండా వెళ్లిపోయిన నాలుగు వేల కో్ల రూపాయల రైతుల బకాయిలను మూడు నెలల్లో చెల్లించిన రైతు బాంధవుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. రుణమాఫీ అని రైతులకు పంగనామాలు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు

 కేంద్రాన్ని అడిగే దమ్ములేదు..

కేంద్రాన్ని అడిగే దమ్ములేదు..

ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్పు చెలిస్తామని తాము చెప్పామని, చంద్రబాబు లేఖ రాసే నాటికి రూ.1600 కోట్లకు పైగా చెల్లించామని కొడాలి తెలిపారు. ప్రతీ రోజూ రూ.200 కోట్ల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా తామే ఇస్తున్నామన్నారు. ఆ నిధుల్ని విడుదల చేయమని కేంద్రాన్ని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. ఇప్పటికే తాము 25 లక్షల క్వింటాళ్లు సేకరించామని మంత్రి కొడాలి తెలిపారు.

 లోకేష్‌ కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే

లోకేష్‌ కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే

కరోనా వచ్చిందని చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని మాట్లాడుతున్నారని, ఆయనకు దేవినేని ఉమ వంటి వారు వంతపాడుతున్నారని కొడాలి విమర్శించారు. ఉమను మహిళలే కొట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌కి ఇంట్లో భోజనం పెడుతున్నట్లు లేరని అందుకే అసహనంతో జగన్‌పై ఏది పడితే అది మాట్లాడుతున్నారని కొడాలి విమర్శించారు. మీరు ఎన్ని జన్మలెత్తినా జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. లోకేష్‌ కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనని, అతను సింహం ఏమిటని కొడాలి ప్రశ్నించారు. ఆయన చెప్పే మాటలకూ, ఆ ముఖానికీ ఏమైనా సింక్‌ అవుతుందా అని అడిగారు. ఉన్నది ఒక్కడే కాబట్టి దిక్కులేక ప్రమోట్ చేసుకుంటున్నారని,

అదే లోకేష్ కి ఒక తమ్ముడో అక్కో ఉంటే వీడ్ని పక్కన పెట్టేవారన్నారు.

 పిచ్చివాగుడు వాగితే కుక్కల వ్యాన్‌లో..

పిచ్చివాగుడు వాగితే కుక్కల వ్యాన్‌లో..

జగన్‌ దమ్ము నువ్వు చూసిందేంటని మంత్రి కొడాలి లోకేష్‌ను ప్రశ్నించారు. అందుకే ఇంట్లోంచి బయటికి రావడం లేదన్నారు. పిచ్చివాగుడు వాగితే బాబూ కొడుకులకు తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. నువ్వు (లోకేష్‌)చిటికేసేది ఏముంది, మీరిద్దరూ(చంద్రబాబూ,లోకేష్‌) సీఎం చిటికెన వేలు కూడా తాకలేరని కొడాలి అన్నారు. వెన్నుపోటు కోసం కత్తితో తిరిగింది ఎవరు ? నువవ్వు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తావో అని నిన్ను ఫామ్‌ హౌస్‌లో పెట్టింది నిజం కాదా అని లోకేష్‌ను ప్రశ్నించారు. మీ వాగుడు ఇలాగే ఉంటే జగన్ చిటికెలు వేయాల్సిన అవసరం లేదని, వైసీపీ కార్యకర్తలే దేహశుద్ధి చేస్తారని కొడాలి హెచ్చరించారు. టీడీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలు చనిపోలేదా అని కొడాలి ప్రశ్నించారు. ఆ హత్యలన్నింటికీ చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో కక్షల కారణంగా హత్యలు జరిగితే వాటిని సీఎంకు ఆపాదించడంపై కొడాలి అభ్యంతరం తెలిపారు. పిచ్చివాగుడు వాగితే కుక్కల వ్యాన్‌లో ఎక్కించి పంపుతామన్నారు.

  Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu
  English summary
  andhrapradesh civil supplies minister kodali nani on today lambasted on opposition leader chandrababu and his son lokesh over farmers help.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X