వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగాడినై రెచ్చిపోతా, నన్ను కట్ చేస్తే ఏపీనే కట్ చేస్తా: మాణిక్యాలరావు సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు:పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ ఛైర్మెన్ బాపిరాజు వర్గంపై మంత్రి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.తాను అంటరానివాడినా, తన స్వంత నియోజకవర్గంలోనే ఏ కార్యక్రమానికి ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. సహనానికి ఓ హద్దు ఉంటుందంటూ మగాడినై రెచ్చిపోతా అంటూ మాణిక్యాలరావు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు.

Recommended Video

దుర్గ గుడి ఘటన: ఎవరేమన్నారంటే..? మాణిక్యాల రావు రాజీనామా సస్పెన్స్ ?

చచ్చినా వైసీపీలో చేరను, ఆత్మాభిమానం చంపుకోలేను: ఎంపీ కొత్తపల్లి గీతచచ్చినా వైసీపీలో చేరను, ఆత్మాభిమానం చంపుకోలేను: ఎంపీ కొత్తపల్లి గీత

పశ్చిమగోదావరి జిల్లాలోని రామన్నగూడెంలో బుదవారం నాడు జరిగిన జన్మభూమి గ్రామసభలో మంత్రి మాణిక్యాలరావు తీవ్ర అక్కసును వెళ్ళగక్కారు. చాలా కాలంగా టిడిపి నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మంత్రి తన మాటల్లో వ్యక్తం చేశారు.

వైసీతో పొసగదు, పిఆర్పీ అనుభవంతో పవన్ అడుగులు, వారిద్దరూ మిత్రులే: నారాయణవైసీతో పొసగదు, పిఆర్పీ అనుభవంతో పవన్ అడుగులు, వారిద్దరూ మిత్రులే: నారాయణ

కొంతకాలంగా ఈ రెండు పార్టీల నేతల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ముఖ్యంగా మంత్రి మాణిక్యాలరావుకు, టిడిపి నేతల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇవాళ జన్మభూమి సభలోనే మంత్రి మాణిక్యాలరావు తన ఆగ్రహన్ని ప్రదర్శించారు.

జగన్ నమ్మకద్రోహం, నంద్యాలలో వైసీపీ ఓడిపోతోందని తెలుసు; గురునాథ్ రెడ్డిజగన్ నమ్మకద్రోహం, నంద్యాలలో వైసీపీ ఓడిపోతోందని తెలుసు; గురునాథ్ రెడ్డి

నన్ను అంటరానివాడిగా చూస్తున్నారు

నన్ను అంటరానివాడిగా చూస్తున్నారు

తనను తన స్వంత నియోజకవర్గంలోనే అంటరానివాడిగా చూస్తున్నారని ఏపీ మంత్రి మాణిక్యాలరావు ఆరోపించారు. మూడున్నర ఏళ్ళుగా ఇదే పరిస్థితి నెలకొందని మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి నేత జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు వర్గీయులపై మంత్రి మాణిక్యాలరావు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. మూడేళ్ళుగా తాను అన్నింటిని సహనంగా భరిస్తున్నానని మాణిక్యాలరావు చెప్పారు.

నన్ను కట్ చేస్తే మిమ్మల్ని కట్ చేస్తా

నన్ను కట్ చేస్తే మిమ్మల్ని కట్ చేస్తా

నన్ను తన స్వంత నియోజకవర్గంలోనే కట్ చేయాలని భావిస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. నన్ను కట్ చేయాలని చూస్తే ఏపీనే కట్ చేస్తానని మంత్రి మంత్రి మాణిక్యాలరావు ఆగ్రహంతో ఊగిపోయారు.సహనానికి కూడ హద్దు ఉంటుందని మంత్రి చెప్పారు.

నేను శత్రువునా

నేను శత్రువునా

తాను ఏమైనా శత్రువునా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు తనను ఆహ్వనించడం లేదని మంత్రి మాణిక్యాలరావు ప్రశ్నించారు. తనను ఎందుకు దూరం పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చివరకు రామన్నగూడెంలో కూడా నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ ఊరులో ఏదైనా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారా? నేను ఏమైనా శత్రువునా? ప్రతి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రిగారి పక్కన కూర్చునే వ్యక్తిని నేనంటూ మంత్రి మాణిక్యాలరావు జన్మభూమి సభలో స్పష్టం చేశారు.

మగాడినై రెచ్చిపోతా

మగాడినై రెచ్చిపోతా

తనను నిర్లక్ష్యం చేయడంపై మంత్రి మాణిక్యాలరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. జన్మభూమి సభలోనే మంత్రి మాణిక్యాలరావు మగాడినై రెచ్చిపోతా అంటూ వ్యాఖ్యలు చేశారు. మూడున్నర ఏళ్ళుగా తనను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలను మంత్రి ప్రస్తావించారు. ఇక సహించేది లేదని తేల్చి చెప్పారు. తాను కూడ చూస్తానని టిడిపి నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

టిడిపి నేతలను మంత్రి పట్టించుకోవడం లేదు

టిడిపి నేతలను మంత్రి పట్టించుకోవడం లేదు

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మంత్రి మాణిక్యాలరావు టిడిపి నేతలను పట్టించుకోవడం లేదని తాడేపల్లిగూడెం మున్సిఫల్ ఛైర్మెన్ శ్రీనివాస్ ఆరోపించారు.గడచిన మూడేళ్లలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం నేను ఎంతో శ్రమించాను. ఆయన అసలు మర్యాద ఇవ్వరు, అందరినీ చులకనగా చూస్తారు. అందరినీ కలుపుకుని వెళ్లమని చాలాసార్లు చెప్పాం. ఈ విషయాన్ని మా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని శ్రీనివాస్ చెప్పారు.

వైసీపీ నేతలకు ప్రాధాన్యత

వైసీపీ నేతలకు ప్రాధాన్యత

వైసీపీ నేతలకు మంత్రి మాణిక్యాలరావు ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీనివాస్ ఆరోపణలు చేశారు.మంత్రి మహరాజులాగా భావిస్తుంటారని శ్రీనివాస్ చెప్పారు.కులాల పేరుతో ఆయన దూషిస్తుంటారు. ఆయన అహంకారాన్ని భరించలేకపోతున్నామని శ్రీనివాస్ చెప్పారు.

English summary
Ap Enodowment minister Manikyalarao fired on Tdp leaders in janmabhoomi sabha on Wednesday at Ramannagudem in Westgodavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X