హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు రాష్ట్రపతితో రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సమావేశం;ఉపరాష్ట్రపతికి చికిత్స

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

గుంటూరు:ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు సోమవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని ఆయన ఈ సందర్భంగా వినతి చేయనున్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీల్లో నెలకొన్న అభద్రత భావాన్ని తొలగించాలని మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేస్తున్నారు. దళిత, గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

AP:Minister Nakka Ananda babu to meet President tomorrow

మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకున్నారు. వైద్యులు ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుకు కాటరాక్ట్ చికిత్స అందించారు. చికిత్స అనంతరం వెంకయ్యనాయుడు ఇంటికి బయలుదేరి వెళ్లారు. వెంకయ్య నాయుడుకు కంటి చికిత్స సంతృప్తికరంగా జరిగిందని, అయితే ఈ చికిత్సకు సాధారణంగానే కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని, ఆ ప్రకారమే వెంకయ్య నాయుడు కూడా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

English summary
Guntur: Andhra Pradesh Social Welfare Minister Nakka Anandababu will meet President Ramnath Kovind in New Delhi on Monday.He will request to the President over Supreme Court verdict on SC / ST Attitudes Act. Another side Indian Vice-President Venkiah Naidu was treated for eye treatment at the LV Prasad Eye Hospital in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X