• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు, నారా లోకేష్ అక్కడుంటేనే బెటర్: అయ్యన్నపాత్రుడి పాత్రకు సొట్టలు

|

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైందని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజారంజక పరిపాలనకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు.. ఇలా అన్ని స్థాయిల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు.

జగన్ పాలనపై నమ్మకం..

జగన్ పాలనపై నమ్మకం..

ప్రజాతీర్పు ఏమిటనేది స్పష్టంగా కనిపిస్తుందోని, వైఎస్ జగన్‌ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి ఈ ఫలితాలు ప్రతిఫలింపజేస్తున్నాయని అన్నారు. ఎన్నికలను బహిష్కరించడం వల్లే వైసీపీ గెలిచిందని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పంచాయతీ, మున్సిపల్‌ కంటే ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే చేతులు ఎత్తేసి పారిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫలితాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

ఆ 19 మందితో రాజీనామా చేయించగలరా?

ఆ 19 మందితో రాజీనామా చేయించగలరా?

ఈ సందర్భంగా అనిల్ కుమార్.. ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బహిరంగ సవాల్‌ విసిరారు. తెలుగుదేశం పార్టీతో ప్రస్తుతం ఉన్న19 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి..తిరిగి గెలిపించుకునే దమ్మూ, ధైర్యం ఉన్నాయా? అని ప్రశ్నించారు. సిగ్గు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. దేశ చరిత్రలో ఇదివరకెప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పదవుల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు.

మంచి పనులను అడ్డుకుంటున్నారు?

మంచి పనులను అడ్డుకుంటున్నారు?

వైఎస్ జగన్‌ రెండేళ్లుగా ఏ మంచి కార్యక్రమం చేపట్టాలనుకున్నా.. వాటిని అడ్డుకోవాలని చంద్రబాబు, టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలను మేనేజ్‌ చేశారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ- అన్నింటినీ ఎదుర్కొని సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, వైఎస్ జగన్‌ను ప్రజలంతా నమ్మకంతో తమ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.

చంద్రబాబు, లోకేష్ అక్కడుంటేనే బెటర్

చంద్రబాబు, లోకేష్ అక్కడుంటేనే బెటర్

చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌కు పరిమితమైతే మంచిదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తండ్రీకొడుకులు ఏపీకి వస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం తప్ప.. ప్రజలకు మంచి చేయాలని ఏరోజు అనుకోలేదని అన్నారు. ఏపీలో అడుగుపెట్టి మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప ఏమీ లేదని ధ్వజమెత్తారు. మీడియాను అడ్డు పెట్టుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా, నిమ్మగడ్డ ద్వారా రాజకీయం చేయాలని చూసినా.. రాష్ట్ర ప్రజలంతా నిబద్ధతతో తమ ప్రభుత్వం వెంట నిలిచారని చెప్పారు.

వెధవ ప్రచారం..

వెధవ ప్రచారం..

ఎన్నికల తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని తెలిసే మూడు రోజుల ముందు నుంచి చంద్రబాబు వెధవ ప్రచారానికి తెరతీశాడని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సంస్కార హీనుడిలా మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడి పాత్రకు సొట్టపెట్టినట్లు సొట్టలు పెడతామని అన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టే, తిట్టట్లేదని అన్నారు.

జగన్ కన్నెర్ర చేస్తే తిరగగలరా?

జగన్ కన్నెర్ర చేస్తే తిరగగలరా?

వైఎస్ జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, నిజంగా ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తే.. వైఎస్ జగన్‌ కన్నెర్ర చేస్తే టీడీపీ నాయకులు తిరగ గలరా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వ పరిపాలన సాగుతోందని అన్నారు. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా ఉందని అడ్డమైన కూతలు కూస్తే ఊరుకోమని అన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే తాము కూడా వారి భాషలోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

English summary
AP minister for water resources, P Anil Kumar Yadav respond on huge victory in ZPTC, MPTC elections of YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X