• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు కోసం ఢిల్లీ బాబాయిలు.. అరెస్టులపై మంత్రి నాని.. శిక్షకు సిద్ధమన్న వేమూరి..

|

గత టీడీపీ పాలనలో అమలైన పథకాలు, తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సంచలన నివేదిక ఇచ్చింది. ఐదేళ్ల కాలంలో పలు పథకాల్లో భారీ అవినీతి జరిగిందని రిపోర్టు పేర్కొనగా.. దీనిపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ వివరాలను మీడియాకు వెల్లడించే క్రమంలో మంత్రి పేర్ని నాని.. చంద్రబాబును ఉద్దేశించి అనూహ్య కామెంట్లు చేశారు.

నారా లోకేశ్‌పై రూ.700 కోట్ల వల.. జగన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన చినబాబు.. అనూష విషయంలో ఫైర్..

ఇదీ చిట్టా..

ఇదీ చిట్టా..

గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అందులో ప్రధానమైంది.. చంద్రబాబు అక్రమాలపై సీబీఐ దర్యాప్తు అని, టీడీపీ హయాంలో చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా పేరుతో రూ.150 కోట్లు, హెరిటేజ్ మజ్జిగ పేరుతో ఏటా రూ.40 కోట్లు, ఫైబర్ నెట్ పథకం కింద రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించిందని మంత్రి నాని తెలిపారు. ఆ రిపోర్టుల మేరకే సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్రానికి రిక్వెస్ట్ పంపాలని నిర్ణయించామన్నారు.

సరస్వతికి సీఎం జగన్ ప్రాధాన్యం.. డబుల్‘ఆర్'తో విధ్వంసం.. లేవకుండా ‘లా'తో కొడతానంటూ..

బాబూ గెట్ రెడీ..

బాబూ గెట్ రెడీ..

‘‘చంద్రబాబు కోసం త్వరలోనే ఢిల్లీ నుంచి బాబాయిలు వస్తున్నారు.. లెక్కలు చెప్పడానికి ఆయన రెడీగా ఉండాలి మరి. ఇన్నాళ్లూ ఆయన మమ్మల్ని సవాలు చేశారు.. దమ్ముంటే విచారణ జరిపించాలని పదేపదే అడిగారు. ఆయన కొరిందే ఇప్పుడు జరుగుతోంది. దమ్ముంటే లెక్కలతో రెడీగా ఉండండి. గతంలో చంద్రబాబు ప్రజాధనాన్ని తనవాళ్లకు దోచిపెట్టారు. అదే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి పైసాను ప్రజలకే చేరవేస్తున్నారు. ఈ తేడాను జనం గమనిస్తున్నారు''అని మంత్రి నాని అన్నారు.

లోకేశ్ టార్గెట్ గా..

లోకేశ్ టార్గెట్ గా..

నాడు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేశ్ నేతృత్వంలో, వేమూరి హరిప్రసాద్ హెడ్ గా ఏర్పాటైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని పేర్ని నాని చెప్పారు. టెర్రాసాఫ్ట్ అనే సంస్థకు అక్రమంగా టెండర్ ఇచ్చారని, సెటాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. ఫైబర్ నెట్ హెడ్ గా వ్యవహరించిన వేమూరి హరి ప్రసాద్ గతంలో ఈవీఎంల చోరీ కేసులో ముద్దాయి అని మంత్రి గుర్తుచేశారు. సీబీఐ త్వరలోనే నాటి ఐటీ మంత్రి లోకేశ్ తోపాటు వేమూరిని కూడా విచారిస్తుందన్నారు.

అరెస్టులు తప్పవు..

అరెస్టులు తప్పవు..

చంద్రబాబు హయాంలో గ్రీన్ కో సంస్థకు ఇచ్చిన విద్యుత్ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని మంత్రి నాని స్పష్టం చేశారు. కాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 4700 ఎకరాలు అవసరం కాగా, గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక ఎకరాకు రూ. 2.50 లక్షలు మాత్రమే చెల్లిస్తామని చెప్పిందని, జగన్ సీఎం అయిన తర్వాత గ్రీన్ కో సంస్థ యాజమాన్యంతో మాట్లాడి.. నిర్వాసితులకు ఒక ఎకరాకు రూ. 5 లక్షలు ఇచ్చేలా ఒప్పించారని మంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం రిపోర్టుల ఆధారంగా ఇప్పటికే అమరావతి భూకొనుగోళ్లపై దర్యాప్తు సాగుతున్నదని, చట్టం తన పని తాను చేసుకుపోతూ.. ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తున్నదని.. తాజాగా ప్రారంభం కానున్న సీబీఐ దర్యాప్తులోనూ అలాంటి పరిస్థితే ఉండొచ్చని పేర్ని నాని అన్నారు.

  Chandrababu Naidu Should Handover TDP To NTR Scions - Kodali Nani
  శిక్షకు సిద్ధం..

  శిక్షకు సిద్ధం..

  ఫైబర్ నెట్ లేదా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.700 కోట్ల అవినీతి జరిగిందంటూ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులో ప్రస్తావించడం, దానిపై సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయడంపై ఆ ప్రాజెక్టు మాజీ హెడ్ వేమూరి హరి ప్రసాద్ స్పందించారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని, ఒకవేళ అదే జరిగితే వైసీపీ ప్రభుత్వం ఆదారాలు ఎందుకు చూపడంలేదని ఆయన ప్రశ్నించారు. ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగినట్లుగానీ, అందులో తన ప్రమేయం ఉన్నట్లుగానీ నిరూపణ అయితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని వేమూరి సవాలు విసిరారు.

  English summary
  after Andhra Pradesh cabinet decided to seek cbi enquiry into the alleged corruption during the TDP regime, minister perni nani warns chandrababu to get ready with accounts. fibernet former head Vemuri hari prasad also reacted on the issue
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more