అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోతిరెడ్డిపాడుపై టీడీపీ స్టాండ్ ఏంటి ? త్వరలో కృష్ణాబోర్డుకు వివరణ- ఏపీ మంత్రి అనిల్...

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాక రేపుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విషయంలో తమ ప్రభుత్వ వైఖరి సరైనదేనని మంత్రి అనిల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా టీడీపీ తన అభిప్రాయం చెప్పితీరాలన్నారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 203పై కృష్ణారివర్ బోర్డు అభ్యంతరాలకు త్వరలోనే వివరణ ఇస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి అనిల్ మరోసారి తీవ్రంగా స్పందించారు. అప్పటి జలవనరుల మంత్రి దేవినేని ఉమ పోలవరంపై పదేపదే అబద్ధాలు చెబుతున్నారని అనిల్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 30 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు.

ap minister questions tdps stand over pothireddypadu project

పోలవరంలో ఒక భాగానికి సంబంధించిన పనులు మాత్రమే టిడిపి చేసిందన్నారు. మొత్తం ప్రాజెక్టులో చూస్తే కనీసం 30 శాతం కూడా చేయలేదని అనిల్ ఎద్దేవా చేశారు.
ప్రాజక్టు పునరావాస ప్యాకేజీపై మాట్లాడే అర్హత కూడా టీడీపీకి లేదన్నారు. కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచి నిర్వాసితులకు అన్యాయం చేసిన చరిత్ర టీడీపీది అని అనిల్ అన్నారు.

English summary
andhra pradesh water resources minister anil yadav has questioned opposition tdp's stand over pothireddypadu project. anil says that tdp had completed only 30 perccent of polavaram project works in their regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X