వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాధునిక వసతులున్నా లోకేష్ చాంబర్ ను వద్దన్న మంత్రి .. ఎందుకో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో మంత్రివర్గం బాధ్యతలు చేపడుతుంది. మంచి రోజు చూసుకుని ఒక్కొక్కరు తమ బాధ్యతలు చేపడుతున్నారు. ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న తన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న కొత్త మంత్రులు ఛాంబర్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా లోకేష్ ఛాంబర్ అంటే మాత్రం మాకొద్దు బాబోయ్ అంటున్నారు.

మంత్రిగా లోకేష్పై పలు విమర్శలు .. ఎన్నికల్లో ఓటమి .. అందుకే లోకేష్ ఛాంబర్ వద్దన్న కొత్త మంత్రి

మంత్రిగా లోకేష్పై పలు విమర్శలు .. ఎన్నికల్లో ఓటమి .. అందుకే లోకేష్ ఛాంబర్ వద్దన్న కొత్త మంత్రి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడిగా , రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లోకేష్ చాంబర్ అధునాతన వసతులతో ఉన్నప్పటికీ ఆయన చాంబర్ మాకొద్దు అంటున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినా , ఉన్నంత కాలం లోకేష్ పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది . అంతే కాదు ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ హయాంలో లోకేష్ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు . అందుకే అది లక్కీ ఛాంబర్ కాదని ఫిక్స్ అయ్యారు వైసీపీ మంత్రి వర్యులు .

లోకేష్ ఛాంబర్ ను తిరస్కరించి వేరే ఛాంబర్ తీసుకోవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయం

లోకేష్ ఛాంబర్ ను తిరస్కరించి వేరే ఛాంబర్ తీసుకోవాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయం

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్తగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో లో పంచాయితీ రాజ్, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టారు . పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గత ప్రభుత్వ మంత్రివర్గంలోలాగే సచివాలయంలోగల 5వ బ్లాక్ లోని ఛాంబర్ ని కేటాయించారు. అయితే అది లోకేష్ ఛాంబర్ కావటంతో సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ ఛాంబర్ ని తిరస్కరించి, మరొక ఛాంబర్ ని తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు.ఈమేరకు సచివాలయంలోని 3వ బ్లాక్ లో 203వ రూమ్ ని తన ఛాంబర్ గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

 లోకేష్ ఛాంబర్ కు వాస్తు లేదట .. అందుకే తిరస్కరించానన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

లోకేష్ ఛాంబర్ కు వాస్తు లేదట .. అందుకే తిరస్కరించానన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గురువారం నాడు ఆయన తన కొత్త ఛాంబర్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.గత ప్రభుత్వంలోని మంత్రి లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ ని మంత్రి వద్దని చెప్పటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొత్త మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోకేష్ ఛాంబర్ ను తిరస్కరించడం వెనుక గల కారణం ఏంటి అని ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ లోకేష్ ఛాంబర్ ఎన్ని రకాల సదుపాయాలతో, అత్యాధునికంగా, ఎంతో విశాలంగా ఉన్నపటికీ కూడా, పెద్దిరెడ్డి ఆ ఛాంబర్ కి వాస్తు సరిగా లేదని చెప్పుకొస్తున్నారు. ఇంత అకస్మాత్తుగా ఆ ఛాంబర్ కి మార్పులు చేయించడం కంటే వేరే ఛాంబర్ ని తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతోనే ఛాంబర్ మార్చుకున్నానని తెలిపారు. ఏది ఏమైనా సచివాలయంలో లోకేష్ ఛాంబర్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.

English summary
Newly elected Panchayat Raj minister of Andhra Pradesh Peddireddy Ramachandra Reddy has apparently refused to take the chamber which was previously used by Nara Lokesh.The senior leader said that this is not a lucky chamber and pointed out that Lokesh faced a humiliating defeat from Mangalagiri.Initially, he was allotted the chamber in 5th block of the Secretariat, but Ramachandra Reddy requested the general administration department to change his room. Reportedly, the cabinet minister was assigned Room no. 203 in the third block now. He will be taking charge as the minister of Panchayat Raj .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X