
శెట్టిబలిజలకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణ- వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కడంపై..
ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ జగన్ కేబినెట్ ప్రక్షాళన తర్వాత రెండోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ వెంటనే ఆయన్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తొలుత జర్నలిస్టులు జగన్ ను ఆరాధించే కానీ ఆరాలు తీయకూడదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వేణు.. ఆ తర్వాత పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లారు. దీంతో ఆయన సొంత సామాజికవర్గం శెట్టిబలిజల నుంచే తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వేణు ఇవాళ వారికి క్షమాపణలు చెప్పారు.
గత వారం రోజులుగా పలు ఎల్లో మీడియా పత్రికలు, ఛానళ్లు శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారిపై తమకు అమితమైన ప్రేమ ఏదో ఉన్నట్టు, జరగనిది జరిగినట్లుగా తమదైన వక్ర భాష్యాలతో విష ప్రచారం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపించారు. శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని తానేదో తాకట్టు పెట్టినట్లుగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ, టీడీపీ, జనసేనలకు చెందిన కొంతమంది నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

శెట్టిబలిజ నేత కుడిపూడి చిట్టబ్బాయ్ వర్థంతి సభకు వెళ్ళి, ఆ కుటుంబానికి ఎంతో సాయం చేసిన జగన్ ప్రతినిధిగా ఆ సభకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్ళపై వంగి నమస్కారం చేస్తే దానికి వక్రభాష్యాలు చెబుతూ చిలువలు పలువలుగా మాట్లాడుతున్నారని . ఆ నమస్కారాన్ని సంస్కారంగానే భావించానే తప్ప, ఎవరినీ అవమానించడానికి కానేకాదన్నారు. లేనిదానిని ఉన్నట్టు చూపుతూ, వక్రభాష్యాలు చెబుతూ... ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాల వల్ల, అది మా జాతీయులకు ఎవరికైనా బాధకలిగించినట్లయితే దానికి చింతిస్తున్నానన్నారు.
మనకు
సాయం
చేసినవారికి
కృతజ్ఞతగా
ఉండాలనే
భావనే
తప్ప,
అందులో
ఎటువంటి
దురుద్దేశాలు
లేవన్నారు.
కృతజ్ఞత
తెలియచేయడమే
నేరం
అన్నట్టుగా
మా
సామాజికవర్గానికి
చెందిన
టీడీపీ,
జనసేన
పార్టీలకు
చెందిన
కొంతమంది
నేతలు
మాట్లాడటం
చూస్తుంటే
విచిత్రంగానూ,
వింతగానూ
ఉందన్నారు.
తమ
సామాజికవర్గంలో
చిచ్చు
పెట్టి,
తద్వారా
రాజకీయ
లబ్ధి
పొందాలన్నదే
టీడీపీ,
జనసేన
పార్టీల
ఉద్దేశమని
మంత్రి
వేణు
అన్నారు.
జాతి
కాదు
ఒక
జాతీయుడిగా
అని
తాను
ఉచ్ఛరించిన
పదాన్ని,
ఏబీఎన్,
ఈటీవీ,
టీవీ5లు
జాతి
తరఫున
అన్నట్టుగా,
నేనేదో
జాతిని
తాకట్టు
పెట్టినట్టు
విష
ప్రచారాని
తెరతీయడం
దారుణమన్నారు.
ఇందుకు
సంబంధించి
మాట్లాడిన
వీడియోను
మీడియాకు
విడుదల
చేశానన్నారు.
తనపై విమర్శలు చేస్తున్న జనసేన నాయకులను ఉద్దేశించి మీ జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వెళ్ళి మాయావతి కాళ్ళు పట్టుకున్నారు. అలానే చంద్రబాబు మాదిరిగా చీకట్లో చిదంబరం, నేరుగా మోడీ కాళ్ళు పట్టుకోలేదు. చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మేం చేయబోమని మంత్రి వేణు తెలిపారు. ఇదే శెట్టి బలిజ వర్గీయులు 2014లో మాకు రెండు సీట్లు ఇవ్వండి అని చంద్రబాబును అడిగితే.. "సీట్లు ఇస్తే మీరు గెలుస్తారా.. మీకు ఆ సామర్థ్యం ఉందా" అని హేళన చేశారని వేణు గుర్తు చేశారు.
శెట్టి
బలిజ
వర్గానికి
చెందిన
చెల్లుబోయిన
వేణు
అనే
తనపై
జగన్
మనసులో
ప్రత్యేకమైన
స్థానం
ఉండబట్టే
కొత్త
మంత్రివర్గంలో
బీసీ
సంక్షేమంతోపాటు
సమాచార,
పౌర
సంబంధాలు,
సినిమాటోగ్రఫీ
శాఖలు
కేటాయించారన్నారు.
శెట్టి
బలిజలకు
జగన్
ఇస్తున్న
ప్రాధాన్యం,
పదవులు
చూసి,
ఆ
సామాజిక
వర్గం
అంతా
వైఎస్ఆర్సీపీకి
చేరువ
అవ్వడంతో
ఓర్చుకోలేక
టీడీపీ,
జనసేన
పార్టీలకు
చెందిన
వారు
ఇష్టం
వచ్చినట్లు
దుష్ప్రచారం
చేస్తున్నారన్నారు.
జాతిని
అమ్ముకోవాల్సిన
ఖర్మ
తనకు
పట్టలేదన్నారు.
జాతిని
నమ్ముకుంటాను
తప్ప
అమ్ముకోనన్నారు.
మా
జాతి
నాయకులకు
మేలు
జరుగుతుందంటే
వారి
కోసం
ఎంతవరకైనా
పోరాడతానన్నారు.