వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'భారతిని అడ్డుపెట్టుకొని జగన్ రాజకీయం, ఆమెపై కేసుతో జగన్‌కు అర్థంకావట్లేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఈడీ అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి పేరు ఉంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదివారం అన్నారు. ఆమెపై ఈడీ కేసు నమోదు కారణంగా జగన్‌కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు.

Recommended Video

నిందితురాలిగా జగన్‌ సతీమణి భారతి పేరు

చదవండి: నా భార్యనూ కోర్టులకు తిప్పుతారా, ఈడీలో ఆ ఇద్దరికి బాబుతో సంబంధాలు: జగన్ సంచలనం, ప్రశ్నల వర్షం

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలతో సంపాదించి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. తమపై అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈడీ కేంద్ర పరిధిలోని సంస్థ అని జగన్‌కు తెలియదా అన్నారు.

AP Ministers blame YS Jagan for dragging Bharathi

తుని ఘటనపై సీఎంపై జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ ఘటనతో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. జగన్ ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పాకులాడుతున్నారని అందుకే ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తున్నారన్నారు.

చదవండి: అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా భారతి పేరు: ఇంత దారుణమా... షాకైన జగన్

ఈడీ కేసులు నమోదు చేస్తే జగన్ దానిని కూడా రాజకీయం చేస్తున్నారని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్‌లో తప్పు చేశాననే పశ్చాత్తాపం ఎక్కడా లేదన్నారు. జగన్‌కు ప్రజలపై ప్రేమ ఉంటే దోచుకున్న ధనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. తన భార్య భారతిని అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతి పొందాలనుకుంటున్నారన్నారు. కేంద్రం కుట్రలో రాజ్యసభ సబ్యులు జీవీఎల్ నరసింహారావు పావుగా మారారన్నారు.

English summary
AP Ministers blame YSR Congress Party chief YS Jagan Mohan Reddy for dragging Bharathi into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X