వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ .. తిరుమలలో మంత్రుల క్రిస్మస్ విషెస్ .. ద్వారకా తిరుమలలో దెందులూరు ఎమ్మెల్యే చేసింది అదే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ ఒకేరోజు రావడంతో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆలయాలకు వెళ్లిన అమాత్యులు ఆలయాల వద్ద క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు హిందువులకు ఆగ్రహం తెప్పిస్తుంది.

తిరుమ శ్రీవారిని సన్నిధిలో మంత్రులు నారాయణస్వామి , అవంతి శ్రీనివాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు

తిరుమ శ్రీవారిని సన్నిధిలో మంత్రులు నారాయణస్వామి , అవంతి శ్రీనివాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు


తిరుమల వెంకన్న ఆలయంలో అపచారం చోటుచేసుకుంది .ఈ రోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు శ్రీవారి సన్నిధికి బారులుతీరారు. గోవింద నామస్మరణతో శేషాచల కొండ మారుమోగుతోంది. ఈ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ కొండపైనే స్వామివారి సన్నిధి వద్దే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్, ఏకాదశి పర్వదినాలు ఒకేరోజు వచ్చాయని శ్రీవారు, ఏసుక్రీస్తు, అల్లా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని కోరుకుంటున్నామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి క్రిస్మస్ విషెస్

ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి క్రిస్మస్ విషెస్

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం తిరుమల కొండపై అన్యమత ప్రస్తావన తీసుకు రాకూడదనే నిబంధనలను పెడచెవిన పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో మంత్రుల తీరుపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు మండి పడుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో దర్శనానికి వెళ్లిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆలయ ప్రాంగణంలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆలయ ఆవరణలో సీఎం జగన్మోహన్ రెడ్డికి, దెందులూరు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

చెప్పులతో తిరిగిన ద్వారకా తిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్

చెప్పులతో తిరిగిన ద్వారకా తిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్


ఆలయ ప్రాంగణంలో నిలబడి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ఇదే సమయంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ చెప్పులతో ఆలయ ప్రాంగణంలో సంచరించి భక్తులకు ఆగ్రహం తెప్పించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆలయ ట్రస్ట్ బోర్డు నెంబర్ మేడిపల్లి గంగరాజు చెప్పులతో తిరిగారు. ఈరోజు ద్వారకాతిరుమల లో చోటు చేసుకున్న అపచారాలతో భక్తులు ఎమ్మెల్యే, ఆలయ ట్రస్ట్ బోర్డు నెంబర్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
Minister Avanti Srinivas and Narayana Swamy, who visited Tirumala on the occasion of Mukkoti Ekadashi today, they wished there a Merry Christmas. The ministers said that Christmas and Ekadashi came on the same day and wished Jaganmohan Reddy the blessings of venkanna, Jesus Christ and Allah .Denduluru MLA Abbayya Chowdhury did the same at the Dwarka Thirumala Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X