వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో విలీనానికి పవన్ కల్యాణ్ భారీ ఏర్పాట్లు...?

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్‌కల్యాన్ పర్యటనపై వైసీపీకి చెందిన నాయకులు , మంత్రులు ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ స్యయంగా తెలిపారని గుర్తు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నానీతో పాటు ,పేర్నీ నానీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి పలు తీవ్రంగా విరుచుపడ్డారు.

అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్‌ కళ్యాణ్ అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్‌ కళ్యాణ్

 పవన్ కళ్యాణ్, మంత్రుల మధ్య మాటల యుద్దం

పవన్ కళ్యాణ్, మంత్రుల మధ్య మాటల యుద్దం

గత రెండు రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాన్ ఏపీ ప్రభుత్వ విధానాలతో పాటు సీఎం జగన్‌పై కూడ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన తిరుపతిలో పర్యటించారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర వాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నేతలు సైతం తమ స్పీడును పెంచారు... దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మంగళవారం తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కొడాలి నానీ, పేర్నీ నానీలు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 జనసేనను, బీజేపీలో విలీనం చేస్తారు

జనసేనను, బీజేపీలో విలీనం చేస్తారు

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న వాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపిలో కలిపేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన... సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను పొగడడంతో పాటు, బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా పార్టీని విలీన సంకేతాలను ఇచ్చినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయమై... జనసేనను బీజేపీలో విలీనం చేయాలని అమిత్ షానే అడిగారని పవన్‌కల్యాణ్ స్వయంగా చెప్పారని అన్నారు.

 చంద్రబాబు తానా అంటే పవన్ తందానా

చంద్రబాబు తానా అంటే పవన్ తందానా


పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలను పొగుడుతున్నారని అలాంటీ సమయంలో ఆయన జైలుకు ఎందుకు వెళతారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను గుర్తించకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక ఉల్లి ధరలు తగ్గించలేని 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఢిల్లీలో ఉల్లిధర 100 రూపాయలు ఉంటే ఏపీలో 25 రూపాయలే ఉందని నాని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 డైలాగులన్ని సీనిమాల్లోనే

డైలాగులన్ని సీనిమాల్లోనే


ఇదే అంశాలను మంత్రి పేర్నీ నానీ సైతం ప్రస్తావించారు.... పనన్ కళ్యాణ్ పూనకం వచ్చినట్టు, నోటికి ఏదిపడితే అదే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇవన్ని సినిమాల్లో బాగుంటాయని ఎద్దెవా చేశారు. దీంతో సినిమాల్లో అయితే సింగిల్ టేకులు ఉంటాయని అక్కడ హీరోలు చెప్పిందే వేదంగా కనిపిస్తుందని అన్నారు. కాని రాజకీయాల్లో అలా ఉండదని హితవు పలికారు. అమిత్ షాను పొగడడం ద్వార పార్టీ విలీనానికి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

అమిత్ షానే కరెక్ట్

అమిత్ షానే కరెక్ట్


మంగళవారం తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాల్లో నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయని పవన్ కల్యాణ్ అన్నారు.. ఈనేపథ్యంలోనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా లాంటీ నేతలు ఈ రోజుల్లో కరెక్ట్, అని పొగిడారు. తాను భావితారాల కోసమే పోరాటం చేస్తున్నానని అన్నారు.. ఇక ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నవారే సీఎం అయితే... నిజాయితీగా ఉన్న తనకు మాత్రం ఎంత మొండితనం ఉంటుందో తెలియదా... అన్నారు. మరోవైపు రాయలసీమలో కొన్ని గ్రూపులు కట్టి కబ్జా చేశాయని విమర్శించారు. తాను అన్నింటికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఉల్లి ధరలు తగ్గించలేనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారని.. చట్టసభల్లో ఉన్న వారికి విలువ ఉంటుందా అంటూ ప్రశ్నించారు. వారే అలా చేస్తే ప్రజల్లో ఎలా మార్పు వస్తుందని ప్రశ్నించారు.

English summary
YCP leaders and ministers fire on Janasena chief Pawan Kalyan's comments. janasena maybe merge into BJP soon said ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X