విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా ప్రభావిత జిల్లాల్లో ఏపీ మంత్రుల పర్యటన .. అధికారులతో పరిస్థితి సమీక్ష

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఏపీలోనూ ప్రభావం చూపుతుంది. ఏపీలో ఇప్పటికి ముగ్గురు కరోనా వైరస్ బాధితులు తేలడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ నమోదైన జిల్లాల్లో అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా జిల్లాలో పర్యటించి కరోనా ప్రభావం జిల్లాల పైన ఏ విధంగా ఉందో కనుక్కుంటున్నారు మంత్రులు.

 చెత్త రాజకీయాలు ..బెదిరిస్తే భయపడను : వైసీపీ నేతలకు బైరెడ్డి శబరి వార్నింగ్ చెత్త రాజకీయాలు ..బెదిరిస్తే భయపడను : వైసీపీ నేతలకు బైరెడ్డి శబరి వార్నింగ్

 ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరులలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటన

ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరులలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటన

కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటిస్తున్నారు. కలెక్టర్లు వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం జిల్లాలో ఏ విధంగా ఉంది. కరుణ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు ఏంటి? విదేశాల నుండి వచ్చిన వారి వివరాలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజారోగ్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది.

రేపు విశాఖలో నానీ పర్యటన .. విశాఖ ఎయిర్ పోర్ట్ ను తనిఖీ చేసిన మంత్రి అవంతి

రేపు విశాఖలో నానీ పర్యటన .. విశాఖ ఎయిర్ పోర్ట్ ను తనిఖీ చేసిన మంత్రి అవంతి

ఇక నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పర్యటిస్తున్న ఆళ్ల నాని రేపు విశాఖలో పర్యటించనున్నారు.మరోపక్క విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి అవంతి శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. కరుణ పరీక్షలు చేసే కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇక వైద్య సిబ్బందిని మరింత పెంచాలని డీఎంహెచ్వో కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రయాణికులు అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రయాణికుల నుండి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని అవంతి శ్రీనివాస్ సూచించారు.

కరోనా నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్

కరోనా నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. ఇక నేడు కరోనా నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 135 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 108 మందికినెగిటివ్‌ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 3 కోరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 24 మంది శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

Recommended Video

Good News! Central Govt Announce 3 Medical Colleges In AP
అధికారులతో పాటు రంగంలోకి దిగిన మంత్రులు

అధికారులతో పాటు రంగంలోకి దిగిన మంత్రులు

విదేశాల నుంచి వచ్చే వారికి గృహ నిర్బంధనోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. మొత్తానికి కరోనా నియంత్రణ కోసం అటు అధికారులే కాకుండా, ఏపీలో మంత్రులు కూడా రంగంలోకి దిగారు. ఇక ఏపీ సర్కార్ కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా రేపు జనతా కర్ఫ్యూ సందర్భంగా రవాణా వ్యవస్థను కూడా నిలిపివెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఇక కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో జన సమూహాలుగా తిరగొద్దని ప్రభుత్వం ఆదేశిస్తుంది .

English summary
Corona virus affects the AP. AP government was alerted after three coronavirus victims were still found in AP. Ministers are holding a review meeting with officials in registered districts of Corona Positive. They are asking about the situation. The ministers themselves are traveling around the district and looking at how corona's impact is on districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X