వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ అయితే ఏంటి నేను రైతునే అంటున్న అరకు ఎంపీ మాధవి .. ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ ఎంపీ !!

|
Google Oneindia TeluguNews

ఆమె ఒక మహిళా ఎంపీ .. పార్లమెంట్ సభ్యురాలిగా ఏపీ సమస్యలపై తన గళాన్ని వినిపించాల్సిన ప్రజాప్రతినిధి ఆమె . గిరిజన ప్రాంతానికి చెందిన ఎంపీ అయిన అరకు ఎంపీ మాధవి ఏం చేసినా ఆమెది ఒక విభిన్నమైన శైలి . ఎంపీ అన్న విషయాన్ని పక్కనపెట్టి సాధారణంగా , సాదాసీదాగా వ్యవహరించే ఆమె ఇప్పుడు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ కావటంతో అందరూ పొలం బాట పడుతున్నారు. ఇక ఈ క్రమంలో ఎంపీ స్థాయిలో ఉన్నా కూడా అరకు ఎంపీ గొట్టేటి మాధవి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

ఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ .. వారికోసం ఉచితంగాఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ .. వారికోసం ఉచితంగా

 దుక్కి దున్ని విత్తనాలు చల్లి వ్యవసాయ పనులు చేసిన ఎంపీ మాధవి

దుక్కి దున్ని విత్తనాలు చల్లి వ్యవసాయ పనులు చేసిన ఎంపీ మాధవి

పార్లమెంటు సభ్యురాలు అయినప్పటికీ మొదట నుండి తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనుల్లో అరకు ఎంపీ గొట్టేటి మాధవి పాల్గొన్నారు . తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో ఆమె దుక్కి దున్ని విత్తనాలు చల్లి వ్యవసాయ పనులు చేపట్టారు. తన స్వగ్రామం శరభన్నపాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ భూమిలోనే ఆమె పొలం పని చేశారు. తొలి దశ నుంచి తన తండ్రి ద్వారా సంక్రమించిన వ్యవసాయ పనులు చేస్తూ రైతుగా సాదా సీదా జీవనం సాగించటమే కాక సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఎంపీ మాధవికి అలవాటు. ఎంపీ అయితే ఏంటి తాను రైతునే అంటున్నారు .

మొదటినుండి ఎంపీ మాధవిది సింపుల్ లైఫ్ స్టైల్

మొదటినుండి ఎంపీ మాధవిది సింపుల్ లైఫ్ స్టైల్

కేవలం 25 ఏళ్ల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్ సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రజా ప్రతినిధిగా రికార్డుకెక్కింది. ఇక మాధవి కుటుంబ నేపధ్యానికి వస్తే మొదటి నుండి కమ్యూనిస్ట్ భావజాలంతో మాధవి పెరిగింది. తండ్రి కూడా రాజకీయాల్లో రాణించారు. ఎమ్మెల్యేగా పని చేశారు .ఇక ఎంపీగా ఎన్నిక కావటానికి ముందు ఆమె స్కూల్ టీచర్ గా పని చేశారు . కొండ దొర సామాజిక వర్గానికి చెందిన ఆమె చాలా సామాన్యమైన వ్యక్తిగా నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఎంపీ అయినప్పటికీ ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా జీవిస్తున్నారు .

సోషల్ మీడియాలో ఎంపీ మాధవి వ్యవసాయం ఫోటోలు వైరల్

సోషల్ మీడియాలో ఎంపీ మాధవి వ్యవసాయం ఫోటోలు వైరల్

రైతు కుటుంబం నుంచి రాజకీయ నాయకురాలిగా, ఎంపీ గా ఎదిగిన మాధవి తన మూలాలను ఎన్నడూ మరిచిపోలేదు . కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా నియోజకవర్గం లో ఉంటూ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, తన వ్యవసాయ భూమిలో దుక్కి దున్నుతూ, వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది అరకు ఎంపీ మాధవి. ప్రస్తుతం ఆమె వ్యవసాయం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అప్పట్లో మాధవి పెళ్లి కూడా సెన్సేషన్

అప్పట్లో మాధవి పెళ్లి కూడా సెన్సేషన్

ఇక అప్పట్లో ఎంపీ మాధవి పెళ్లి కూడా ఒక సంచలనమే సృష్టించింది. పెళ్లికి ముందు ఎంపీ మాధవి ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి,ఎన్నో కష్ట నష్టాలను తట్టుకుని పోరాటం సాగించి ఒక మంచి పొజీషన్ కు వచ్చిన తర్వాత ఆ ప్రేమ జంట ఏకం కావటం అచ్చం సినీ స్టొరీ లా అనిపించినా ఎంపీ గొట్టేటి మాధవి విషయంలో అచ్చు ఇలాగే జరిగింది. ఇక సాదా సీదాగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మాధవి పెళ్లి చేసుకోవటం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది .

 పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నా రైతునే అంటున్న మాధవి

పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నా రైతునే అంటున్న మాధవి

కేంద్ర మాజీ మంత్రి, ఐదు సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ను ఓడించి తనకంటూ ఓ స్థానం సుస్థిరం చేసుకున్నగొట్టేటి మాధవి ఎంపీగా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయిలా సింపుల్ గా పెళ్లి చేసుకోవటమే కాదు చాలా సింపుల్ గా జీవించే మాధవి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చెయ్యటం వ్యవసాయం అంటే చిన్న చూపు చూసే వారికి కనువిప్పు కావాలి .

English summary
MP Madhavi, who is a Member of Parliament from the beginning, has been involved in the farming activities on the farm. Her father, a former MLA, given a farm to her She worked sowing seeds and did farming works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X