కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబీకులను ఉద్దేశించి టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్.. సొంత బాబాయినే చంపించడం ద్వారా మరో చెల్లికీ అన్యాయం చేశారని పదే పదే ఆరోపిస్తోన్న బాబు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ అవే అంశాలను ప్రస్తావిస్తూ, వైసీపీ సర్కారు తీరునూ ఎండగట్టే ప్రయత్నం చేశారు..

viral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లుviral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లు

కర్నూలులో చంద్రబాబు షో..

కర్నూలులో చంద్రబాబు షో..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటనలు చేస్తోన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. గురువారం కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ షోలు, సభలు నిర్వహించారు. పట్టణంలోని పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం, పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో రోడ్ షోగా వెళుతూ, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడుతారు. ఈ క్రమంలో ఆయన వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డిల పేర్లను పలు మార్లు ప్రస్తావించారు.

జగన్ వల్ల రోడ్డుపై పడ్డ షర్మిల

జగన్ వల్ల రోడ్డుపై పడ్డ షర్మిల

వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు. అంతేకాదు..

ఏపీలో ఏబీసీడీ పాలన

ఏపీలో ఏబీసీడీ పాలన

గడిచిన 20 నెలలుగా వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని, పల్లెత్తు మాట మాట్లాడినా పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. ''రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతినింది. ఆలయాలపై దాడులు పెరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోంది. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ బాదుడు, సీ కరప్షన్(అవినీతి), డీ అంటే (డిమాలిషన్)విధ్వంసమని దుయ్యబట్టారు. అసలు..

వైసీపీనీ భయపెట్టేదెలా?

వైసీపీనీ భయపెట్టేదెలా?

టీడీపీ హయాంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్‌ మాత్రం విధ్వంసానికి పెద్దపీట వేశారని చంద్రబాబు ఆక్షేపించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ, బలవంతపు ఏకగ్రీవాలు చేశారని టీడీపీ చీఫ్ ఆరోపించారు. ''ఏపీ చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? టీడీపీ సునాయాసంగా గెలిచిన స్థానాలనూ వైసీపీ తన ఖాతాలోకి వేసుకుంది. అసలు ఓటేసే అవకాశమే లేకపోతే ప్రశ్నించే అవకాశం వస్తుందా? ప్రశ్నించే అవకాశం లేకపోతే నాయకులు భయపడతారా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలు కార్పొరేషన్ లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా,

విశాఖ ఉక్కు పోరాటానికి రెడీ

విశాఖ ఉక్కు పోరాటానికి రెడీ

ఏపీకి కిరీటంలా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి 5న) తలపెట్టిన రాష్ట్ర బంద్ కు టీడీపీ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. బంద్‌ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, రాష్ట్ర ప్రయోజనాల అంశంలో టీడీపీ ఏనాడూ రాజీపడబోదని, బంద్ ను విజయవంతం చేయాలని టీడీపీ చీఫ్ అన్నారు.

నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?

English summary
tdp chief chandrababu alleges that ap cm jagan has cheated his own sister ys sharmila by not giving assets and positions. during municipal elections campaign in kurnool on thursday, naidu slams cm jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X