• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మున్సిపల్‌ ప్రచారానికి నేటితో తెర- కీలకంగా పొత్తులు-ఆ మూడింటిపైనే అందరి దృష్టీ..

|

ఏపీలో మూడు వారాలుగా సాగిన మన్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలు తిరిగి నిర్వహిస్తున్న క్రమంలో పార్టీలు, అభ్యర్ధులు, వ్యూహాల ప్రాధాన్యాలు మారిపోయాయి. వీటితో పాటే అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల పొత్తులు, అవగాహనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల హవాను పునరావృతం చేయాలన్న వైసీపీ సర్కారు వ్యూహాలు పని చేయలేదు. ఈ ఎన్నికల్లో 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా ఆ మూడు కార్పోరేషన్లపైనే అందరి దృష్టీ నెలకొంది.

నేటితో మున్సిపల్‌ ప్రచారానికి తెర

నేటితో మున్సిపల్‌ ప్రచారానికి తెర

ఏపీలో హోరాహోరీగా సాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. రేపు ఒక్కరోజు విరామం తర్వాత ఎల్లుండి పోలింగ్‌ జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ తుది ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే నెలకొంది. కొన్ని చోట్ల జనసేన-బీజేపీ, సీపీఎం, సీపీఐ కూడా ప్రభావం చూపుతున్నాయి. మూడు రాజధానులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో పాటు పన్నుల పెంపు వంటి అంశాలతో పాటు మరిన్ని స్ధానిక అంశాలు ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి.

వైసీపీకి మున్సిపోల్స్‌ అగ్నిపరీక్ష

వైసీపీకి మున్సిపోల్స్‌ అగ్నిపరీక్ష

రాష్ట్రంలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు చేయించుకోవడంతో పాటు ఎన్నికల్లోనూ సత్తా చాటుకున్న వైసీపీకి మున్సిపల్‌ ఎన్నికల రూపంలో ఎదురైన ప్రత్యక్ష పోరులో దాన్ని పునరావృతం చేయక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో 2019 ఎన్నికల్లో ఘనవిజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వైసీపీ సర్కార్‌ అనూహ్య ఒత్తిడి ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో పాటు కేంద్రం తీసుకున్ విశాఖ ప్రైవేటీకరణ నిర్ణయాలు కూడా వైసీపీకి సవాళ్లు విసురుతున్నాయి. మరోవైపు పంచాయతీ పోరులో వైసీపీ దూకుడుతో ఇబ్బందులు పడ్డ విపక్షాలు మున్సిపల్‌ పోరులో మాత్రం అధికార పార్టీకి పలు చోట్ల గట్టి పోటీ ఇస్తున్నాయి.

 కీలకంగా మారిన పొత్తులు, అవగాహనలు

కీలకంగా మారిన పొత్తులు, అవగాహనలు

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూకుడుతో కుదేలైన టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలతో పాటు పురపోరులో ప్రభావం చూపే అవకాశం ఉన్న కమ్యూనిస్టులు కూడా తొలిసారి ఆ పార్టీని ఎదుర్కొనేందుకు ఏకతాటిపైకి వచ్చాయి. దీని ప్రభావం పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో కనిపిస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు చోట్ల టీడీపీ కమ్యూనిస్టుల పొత్తుతో బరిలోకి దిగింది. అంతే కాదు జనసేనతో ఎక్కడికక్కడ అవగాహనతో ముందుకెళుతోంది. విజయవాడ వంటి చోట్ల అయితే జనసేన కోసం గెలుపు అవకాశాల్లేని తమ అభ్యర్ధులను కూడా ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పుడు ఈ పొత్తులు,అవగాహనలే ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయి.

మూడు రాజధానులపై నోరెత్తని వైసీపీ, టీడీపీ

మూడు రాజధానులపై నోరెత్తని వైసీపీ, టీడీపీ


ఈసారి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించేందుకు అధికార వైసీపీ కానీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కానీ సాహసించలేకపోయాయి. దీంతో కీలకమైన మూడు రాజధానుల అంశం ఎన్నికల అంశంగా మారకుండా పోయింది. కాబట్టి ప్రజల్లో ఉన్న అవగాహన ఆధారంగానే రాజధానులపై తీర్పు రాబోతోంది. మున్సిపల్‌ పోరులో రాజధానుల ప్రస్తావనకు వైసీపీ, టీడీపీ సిద్ధం కాకపోవడం వెనుక ఓ కీలక కారణముంది. రాజధానుల్ని ప్రస్తావిస్తే జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువన్న అంచనాకు వైసీపీ, టీడీపీ వచ్చేశాయి. వైసీపీ రాజధానుల ప్రస్తావన తెస్తే విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలో ప్రభావం పడుతుందని భావించగా... అటు టీడీపీ రాజధానుల ప్రస్తావన తెస్తే కీలకమైన విశాఖ, తిరుపతిలో నష్టం జరుగుతుందని భావించింది. అందుకే ఇరుపార్టీలు మౌనంగా ఉండిపోయాయి. వీరిద్దరి తీరు చూశాక బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులూ మౌనం వహించారు.

 విజయవాడ, గుంటూరు, విశాఖపైనే అందరి దృష్టీ

విజయవాడ, గుంటూరు, విశాఖపైనే అందరి దృష్టీ

ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల పోరు రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో జరుగుతున్నా పార్టీలతో పాటు జనం దృష్టీ మూడు ప్రధాన కార్పోరేషన్లపైనే ఉంది. ఇందులో కీలకమైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పోరేషన్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ఇందులో రాజధానుల వ్యవహారంతో విజయవాడ, గుంటూరులోనూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో విశాఖలోనూ వైసీపీ సమస్యలు ఎదుర్కొంటోంది. వీటి ప్రభావంతో జనం నిజంగానే ఓట్లేయబోతున్నారా అనేది ఈ ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. అందుకే ఈ మూడు చోట్ల ఇరుపార్టీలు సర్వశక్తులొడ్డుతున్నాయి.

English summary
election campaign for municipal polls in andhra pradesh to be concluded today. all the major political parties including ysrcp, tdp and janasena put all their efforts to win the local battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X