వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును కడిగిపారేసింది..ఆధారాలు అంకెలతో సహా.. వైసీపీకి కాగ్ అస్త్రం..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఏర్పడ్డాక ఆదినుంచే రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. రెవిన్యూలోటుతో ఏర్పడిన రాష్ట్రానికి ఆ కష్టాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. ఇంతకీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందెవరు..? ఆ పాపం ఎవరిది...? కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) చెబుతున్నదేమిటి..?

జగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం: మేము తెచ్చిన జీవో మాటేంటీ? చట్టంలో సవరణలు..సుప్రీంకోర్టుజగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం: మేము తెచ్చిన జీవో మాటేంటీ? చట్టంలో సవరణలు..సుప్రీంకోర్టు

 ఏడేళ్లలో 56శాతం రుణాలు చెల్లించాల్సి ఉంది

ఏడేళ్లలో 56శాతం రుణాలు చెల్లించాల్సి ఉంది

రానున్న ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం రూ.60వేల కోట్లు అప్పులు చెల్లించాల్సి ఉంది. తీసుకున్న రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇది భారంగా మారింది. ఇక అప్పులు చెల్లించేందుకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ.60వేల కోట్లను రుణాల చెల్లింపునకు కేటాయించారు. తక్కువ వనరులు ఎక్కువ ఖర్చులు ఉండటంతో వచ్చిన ప్రభుత్వాలు ప్రతి ఏటా అప్పులు తీసుకోవడంపైనే ఆధారపడుతున్నాయి. 2018 మార్చి 31న కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం రానున్న ఏడేళ్లలో ఏపీ తీసుకున్న మొత్తం రుణాల్లో 56శాతం చెల్లించాల్సి ఉంది. అంటే 2025వ సంవత్సరం నాటికి రూ.91,599 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత రెండేళ్లలో రూ.30వేల కోట్లు చెల్లించడం జరిగింది.

 టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమన్న కాగ్

టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమన్న కాగ్

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై దృష్టి కేంద్రీకరించాలని అదే సమయంలో రుణాలు చెల్లించడంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలని లేదంటే రాష్ట్రంపై అధిక భారం పడుతుందని కాగ్ హెచ్చరించిది. ఉన్న అప్పులను తీర్చడంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లకుంటే అభివృద్ధి విషయంలో వనరులను వినియోగించుకోలేదని స్పష్టం చేసింది. ఇక రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడంలో విజయం సాధించామని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను కాగ్ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన వందల కోట్లు రూపాయలను దారి మళ్లించి ప్రణాళికేతర వ్యయంగా చూపించడంపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓవర్ డ్రాఫ్ట్ పద్దతిన పోకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడపగలిగినట్లయితే అది సరైనా ఆర్థిక నిర్వహణగా పేర్కొంటామని కాగ్ స్పష్టం చేసింది. 2017-18లో ఈ విధమైన ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 134 రోజులు మాత్రమే సరిగ్గా చేయగలిగిందని కాగ్ పేర్కొంది. ఇదే అంశాన్ని కాగ్ తన ఆడిట్‌లో పేర్కొంది.

 చంద్రబాబు తీరే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందా..?

చంద్రబాబు తీరే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందా..?

ఇదిలా ఉంటే తక్కువ మూలధన వ్యయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ లక్ష్యంగా పలుమార్లు విమర్శలు గుప్పించారు. కానీ కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇరిగేషన్ ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయడంలో నాటి టీడీపీ సర్కార్ విఫలమవడం అదే సమయంలో నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో చంద్రబాబు హయాంలోని తొలి నాలుగేళ్లలో అదనంగా రూ.30వేల కోట్లు వెచ్చించాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందని కాగ్ పేర్కొంది. రూ.730 కోట్లతో వడ్డీని సృష్టించిన చంద్రబాబు సర్కార్ అది పెన్షన్ పథకానికి బదిలీ చేయలేదని స్పష్టం చేసింది.

Recommended Video

AP Assembly Budget Sessions పెద్దల సభలో మంటలు, ఏరా అంటూ మంత్రి మీదికి వెళ్లారని...!!

విజయసాయి ఫైర్

ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యవహారాన్ని బయటపెట్టి కాగ్ వైసీపీకి అస్త్రం అందించినట్లయ్యింది. ఇక కాగ్ ఇచ్చిన నివేదిక పై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. చంద్రబాబుకు మీడియా మేనేజ్‌మెంట్ తప్ప ఏదే మేనేజ్ చేయడం తెలియదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరును స్వయంగా కాగ్‌ బయటపెట్టిందని గుర్తుచేశారు సాయిరెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా అనవసరంగా అధిక మొత్తంలో చంద్రబాబు రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు. అనవసరమైన వాటికి డబ్బులను ఖర్చుచేశారని ఇప్పుడు ఆ పాపం రాష్ట్రం అనుభవిస్తోందంటూ ఫైర్ అయ్యారు విజయ సాయిరెడ్డి.


మొత్తానికి 2017-18లో 231 రోజులు చేబదుళ్లు (వేస్‌ అండ్‌ మీన్స్‌), ఓవర్‌ డ్రాఫ్ట్‌లే ఉన్నాయని పేర్కొన్న కాగ్ ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కార్‌ తీరును ఏకిపారేసింది.అప్పులు తెచ్చినా దుబారా చేయడం వల్ల టీడీపీ సర్కార్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా చావుదెబ్బ తీసిందని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తేల్చింది.

English summary
Andhra Pradesh needs to pay Rs.60000 crore in the next seven years says CAG report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X