వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఏకైక అస్త్రాన్నిజ‌గ‌న్‌ హైజాక్ : చ‌ంద్ర‌బాబు చేయ‌లేక‌పోయారు : కొత్త సీఎం చేసి చూపిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

ఏపీ ఎన్నిక‌ల్లో టీడీపీని ఘోరంగా ఓడించిన జ‌గ‌న్‌..టీడీపీ మూలాల‌ను దెబ్బ తీసే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇందు కోసం ప్ర‌మాణ స్వీకారాన్ని ముహూర్తంగా ఎంచుకున్నారు. త‌న ప్ర‌మాణ స్వీకారం పూర్తయిన వెంట‌నే జ‌గ‌న్ కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్నారు. అందులో ఎన్టీఆర్‌కు గుర్తింపు ఇస్తూ ఒక నిర్ణ‌యం ..గ‌తంలో ఎన్టీఆర్ త‌ర‌హాలో తాను అమ‌లు చేసే మ‌రో కీల‌క నిర్ణ‌యం గురించి జ‌గ‌న్ వివ‌రించ‌నున్నారు. దీని ద్వారా టీడీపీకి ప్ర‌స్తుతం ఏకైక అస్త్రంగా ఉన్న ఆ ఒక్క అస్త్రాన్ని జ‌గ‌న్ హైజాక్ చేస్తున్నారు.

జ‌గన్‌ జీతం నెలకు రూపాయి..

జ‌గన్‌ జీతం నెలకు రూపాయి..

ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం వేతనం నెలకు రూ.2.5 లక్షలు. ఇతర అలవెన్సులను కూడా కలిపితే 4-5 లక్షల దాకా అందుతుంది. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకునేవారు. ఇప్పుడు జ‌గ‌న్ సైతం అదే నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయ్యారు.దీని ద్వారా తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌విని హోదాగా కాకుండా బాధ్య‌త‌గా భావిస్తున్నాని సంకేతాలిచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనే అవ‌కాశం ఉంది.

జిల్లాకు ఎన్టీఆర్ పేరు..

జిల్లాకు ఎన్టీఆర్ పేరు..

ఏపీనీ ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా 25 జిల్లాలుగా చేయాల‌ని నిర్ణ‌యించారు. మ‌చిలీప‌ట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతామ‌ని గ‌తంలో పాద‌యాత్ర స‌మ‌యంలోనే జ‌గ‌న్ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ప్ర‌మాణ స్వీకారం త‌రువాత ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భ ప‌రిధిలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎన్టీఆర్ స్వ‌గ్రామం నిమ్మ‌కూరు ఉంది. దీంతో..ఆ నియయోక‌వ‌ర్గంతో ఏర్ప‌డే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు ప్ర‌క‌టించి...తాను ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌నే సంకేతాలు ఇస్తూ.. అంద‌రివాడుగా నిల‌వాల‌నే జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఇది ఒక ర‌కంగా చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా చెక్ పెట్ట‌ట‌మే అవుతుంది.

టీడీపీ ఏకైక అస్త్రం హైజాక్..

టీడీపీ ఏకైక అస్త్రం హైజాక్..

టీడీపీ ఇప్పటికీ ఎన్టీఆర్ పేరు మాత్ర‌మే అస్త్రంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. అయితే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్రంలో తొమ్మ‌ది ఏళ్లు..విభ‌జించిన ఏపీలో అయిదేళ్లు సీఎంగా ఉన్నారు. కానీ, ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌లేదు. కేంద్రంతో స‌న్నిహితంగా ఉన్న స‌మ‌యంలోనూ ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఇప్పించ‌లేక పోయార‌నే విమ‌ర్శ చంద్ర‌బాబు మీద ఉంది. ఇప్పుడు జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తూనే రాజ‌కీయంగానూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ తీసుకుంటున్న ఈ రెండు నిర్ణ‌యాలు ఖ‌చ్చితంగా చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టేవే.

English summary
AP new CM Jagan strategically moving on NTR name using in his government decisions. He decided to take one rupee salary and name one district as NTR district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X