అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులు - మారుతున్న హద్దులు : కొత్త జిల్లా - పరిధిలోని శాసనసభా స్థానాలు.!!
ఏపీలో రాజకీయ సందడి మొదలైంది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తోంది. అయితే, కేంద్రం జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ జిల్లాల హద్దులు మార్చవద్దంటూ చేసిన ఆదేశాలతో.. ముందుగా కసరత్తు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని యోచిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనే నిర్ణయంతో.. కొత్త జిల్లాలకు పేర్ల ఖరారులోనూ అక్కడి చారిత్రక..సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో సరిహద్దు నియోజకవర్గాలు..కొత్త జిల్లాల్లో చేరనున్నాయి.

26 జిల్లాల జిల్లాల సరిహద్దులు..
ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయగా... 30 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 13 కొత్త జిల్లాల పేర్లు.. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, అరకు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, రాజమండ్రి జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా గా ప్రతిపాదించారు.

పల్నాడు జిల్లా.. శ్రీబాలాజీ పేరు
భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా, రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా, హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లా గా ఖరారు చేసారు. విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాలో కలుపుతూ ప్రతిపాదన చేసింది.
విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలుపుతూ కమిటీ ప్రతిపాదన చేసింది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో మన్యం జిల్లా... పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాలు ఆవిర్భావం కానున్నాయి. అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాలు యథాతథంగా జిల్లాలుగా రానున్నాయి. నరసాపురం కేంద్రంగా భీమవరం జిల్లా రానుంది.

ఒంగోలు జిల్లాలోకి సంతనూతలపాడు
బాపట్ల పార్లమెంట్ పరిధిలోని సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలుపుతూ కమిటీ ప్రతిపాదన చేసింది. నెల్లూరు జిల్లాకు ఇప్పుడు ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గం అదనంగా చేరనుంది. తిరుపతికి ఇప్పుడు 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చంద్రగిరి అసెంబ్లీ సెగ్మెంట్ అదనంగా చేరనుంది.
చిత్తూరుకు 6 నియోజకవర్గాలతో పాటు పుంగనూరు సెగ్మెంట్ అదనంగా చేరనుంది. ఆరు నియోజకవర్గాలతో రాజంపేట జిల్లా, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కడప జిల్లా, 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాకు ఇప్పుడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నంద్యాలలోని పాండ్యన్ అసెంబ్లీ సెగ్మెంట్ అదనంగా చేరనుంది. అనంతపురం జిల్లాకు ఏడు నియోజకవర్గాలతో పాటు రాప్తాడు సెగ్మెంట్ అదనంగా చేరనుంది.

ఉత్తరాంధ్రలో అసెంబ్లీ సెగ్మెంట్లు ఇలా
ఇక, తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ జిల్లా పరిధిలో ఉంటాయనేది ప్రభుత్వం స్పష్టత ఇఛ్చింది. శ్రీకాకుళం జిల్లా - పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల ఉండనున్నాయి. విజయనగరం జిల్లా- రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్ కోట ఉండనున్నాయి.
విశాఖపట్నం జిల్లా- భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక ఉండేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. అనకాపల్లి జిల్లా- చోడవరం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ఉండనున్నాయి. అరకు జిల్లా -పాడేరు, అరకు, రంపచోడవరం ఉంటాయి. పార్వతీపురం జిల్లా- పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతీపురం ఉండనున్నాయి.

గోదావరి - కోస్తా జిల్లాల్లో మర్పులు
కాకినాడ జిల్లా- తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం నిర్ణయించారు. రాజమండ్రి జిల్లా- రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. అమలాపురం జిల్లా- రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం ఉంటాయి. ఏలూరు జిల్లా- ఏలూరు, దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు ఉండనున్నాయి. నర్సాపురం జిల్లా- పాలకొల్లు, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం ప్రతిపాదించారు. మచిలీపట్నం జిల్లా- పెడన, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, గుడివాడ. విజయవాడ జిల్లా- విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు ప్రతిపాదించారు. బాపట్ల జిల్లా- వేమూరు, రేపల్లె, చీరాల, బాపట్ల, పర్చూరు, అద్దంకి ఉండనున్నాయి.

నెల్లూరు జిల్లాలోకి మరో అసెంబ్లీ స్థానం
నరసరావుపేట జిల్లా- సత్తెనపల్లి పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల తో ప్రతిపాదించారు. గుంటూరు జిల్లా- గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడికొండ నిర్ణయించారు. ఒంగోలు జిల్లా- ఒంగోలు, కదిరి, సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం ఉంటాయి.
నెల్లూరు జిల్లా- నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కొవ్వూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు ఉండనున్నాయి. తిరుపతి జిల్లా- తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నిర్ణయించారు. చిత్తూరు జిల్లా- చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు ను ప్రతిపాదించారు. కడప జిల్లా -కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ కొనసాగనున్నాయి.

సీమలో కొత్త జిల్లాలు.. కొత్త పేర్లతో
రాజంపేట జిల్లా- తంబళ్లపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు ఉంటాయి. నంద్యాల జిల్లా- ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా- పాణ్యం, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ ఉండేలా ప్రతిపాదిస్తూ.. వీటి పైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. హిందూపురం జిల్లా- కదిరి, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర ఉండగా.. అనంతపురం జిల్లా- రాప్తాడు, అనంతపురం, అర్బన్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు ఉన్నాయి.