• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ కొత్త ఎస్ఈసీగా మన్మోహన్ సింగ్..? మరో ఆర్డినెన్స్ జారీకి సర్కార్ కసరత్తు

|

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. మరోకరిని కమిషనర్‌గా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు పలువురి పేర్లు పరిశీలనలో రాగా.. ముందువరసలో మన్మోహన్ సింగ్ పేరు వినిపిస్తోంది.

2021లో ఉప ఎన్నికల కోసం వైఎస్ జగన్ భారీ స్కెచ్: పావులు కదుపుతున్నారంటోన్న వైసీపీ

సెక్షన్ 200

సెక్షన్ 200

పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను ప్రభుత్వం సూచనతో గవర్నర్ నియమించాలనే అంశాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడే కాదు 1994 నుంచి ఎన్నికల కమిషనర్ నియామకాలు అలానే జరిగాయని కనకరాజు తరఫున న్యాయవాదులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో ఇదే అంశంపై పోరాడుతామని.. తమకు అనుకూలంగా తీర్పు వస్తోందని భావిస్తున్నారు.

 సుప్రీం స్టే ఇస్తే...?

సుప్రీం స్టే ఇస్తే...?

నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టు ఇఛ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే.. మధ్యేమార్గంగా కొత్త ఎన్నికల కమిషనర్ నియమించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఇదివరకు మాదిరిగా ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి... ఆ పై స్థాయిలో పనిచేసినవారిని నియమిస్తామని చెబుతోంది. అందుకోసం మన్మోహన్ సింగ్ పేరును పరిశీలిస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రత్యేక సీఎస్ క్యాడర్‌లో రిటైరనందున ఆయనవైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

 2 నెలల గడువు

2 నెలల గడువు

హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అమలు చేయకుంటే 2 నెలల వ్యవధి ఉంటుంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. అప్పటివరకు కోర్టులో వాదోపవాదనలు జరుగుతాయి. కానీ రాజ్యాంగబద్దమైన పదవీని ఖాళీగా ఉంచకూడదని... స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ మధ్యలో ఉన్నందున ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిందని తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పంచాయతీరాజ్ చట్టంలో అలాంటి వెసులుబాట్లు లేవు. కమిషనర్ పోస్టు ఖాళీ అయితే చట్టాన్ని సవరించి.. మరో ఆర్డినెన్స్ జారీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా జారీచేసి మన్మోహన్ సింగ్‌ను నియమించాలనే ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  AP CM Jagan To Hold Cabinet Meetings Here After In Vizag
  కమిషనర్ కోసం కసరత్తు...?

  కమిషనర్ కోసం కసరత్తు...?

  కొత్త కమిషనర్ నియమించడానికి కసరత్తు ప్రారంభమైందని సమాచారం. దీనికి కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిశీలిస్తున్నారు. ఇదివరకు కనకరాజు నియామకం కోసం.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆపై స్థాయి అధికారి బదులు హైకోర్టు రిటైర్డ్ జడ్జీని అని నిబంధన విధించారు. దీనిని నిమ్మగడ్డ తప్పుపట్టి.. హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు జారీచేసిన ఆర్డినెన్స్, కనకరాజ్ నియామకం చెల్లదని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నందన.. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు వేస్తే.. మరో ఆర్డినెన్స్ జారీచేసి మన్మోహన్ సింగ్‌ను కొత్త కమిషనర్‌గా నియమించడం ఖాయమని.. ప్రభుత్వ చర్యలను బట్టి అర్థమవుతోంది.

  English summary
  andhra pradesh new sec will be manmohan singh but after supreme court stay for highcourt verdict.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more