• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అంతా తెలంగాణకేనా?: ప్రజల్లో తిరుగుబాటు, విభజన పంపకాలపై అశోక్‌బాబు హెచ్చరిక

By Nageswara Rao
|

హైదరాబాద్: ఆస్తులతోపాటు అప్పులను కూడా దామాషా ప్రకారం పంచుకోవాల్సిందేనని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. 13 జిల్లాల రాష్ట్ర ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం సమావేశంలో పాల్గొనడానికి ఆదివారం గుంటూరుకు వచ్చిన అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆస్తులు, అప్పుల పంపకాలు, నవ్యాంధ్రకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీరులో మార్పు రాకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని
హెచ్చరించారు. ముఖ్యంగా ''ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో ఎన్నో కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు ఉన్నాయి. వాటిని పంచుకునే విషయంలో రెండేళ్లయినా స్పష్టత లేదు. దీనిపై ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం స్పందించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్‌ చేశారు.

దీంతో పాటు కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని, దానికోసం దేశంలోని 29 రాష్ట్రాలు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాడాల్సి ఉంటుందని తెలిపారు. ''పబ్లిక్‌ సెక్టార్‌లోని ఆస్తులను పంచుకుంటే మన రాష్ట్ర వాటా ప్రకారం కనీసం 20 వేల కోట్ల వరకు వస్తుంది. ఆయా సంస్థల స్థలాలు, కార్యాలయాలను ముక్కలు చేయలేం. మన రాష్ట్ర వాటా ప్రకారం రావాల్సిన ఆస్తికి ఖరీదు కట్టి ఫీజుగా తీసుకోవాల్సిందే''నని వివరించారు.

ap ngo leader ashok babu fires on telangana government

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కపైసా కూడా వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే హైదరాబాద్‌లోని పీవో కార్యాలయాన్ని రాజధానికి మార్చాలని ఎన్నోసార్లు కోరామని, కేవలం ఆ కార్యాలయం నుంచే తాము హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు రూ. 4 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వం ఏడాదికి వివిధ రూపాల్లో రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తుందని, అదంతా తెలంగాణ ప్రభుత్వానికే వెళుతుందని చెప్పారు. నవ్యాంధ్ర నూతన రాజధాని విషయంలో, చర్చల్లో అంగీకరించిన అంశాల్లో కొన్ని పరిష్కారం కాగా ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని అశోక్‌బాబు తెలిపారు.

ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. మహిళా ఉద్యోగులకు ఉమెన్స్‌ హాస్టల్స్‌ లేక సర్వీసు అపార్టుమెంట్స్‌ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు.

హైదరాబాద్‌ ఏజీ కార్యాలయం, రిజర్వు బ్యాంక్‌ తదితర అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న భార్యాభర్తలను అక్కడే ఉంచాలని, పబ్లిక్‌ సెక్టార్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్ల పెంపు నిర్ణయాన్ని జూన్‌లోగా అమలు చేయాలని ఆయన కోరారు.

మరోవైపు హెల్త్‌ కార్డుల ధరల విషయంలో ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఆరు వారాల్లోగా జాబితా ఇస్తామని చెప్పిన కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఈరోజుకీ మాట నిలుపుకోలేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఏపీ ఉద్యోగులకు వైద్యం చేయడం లేదని అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి చంద్రశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
ap ngo leader ashok babu fires on telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X