వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్ లో సీఎం జగన్ కు ప్రవాసాంధ్రుల స్వాగతం : జై జగన్ నినాదాలతో ఆహ్వానం (వీడియో)...

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాషిం‍గ్టన్‌ డీసీ చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్ కు ప్రవాసాంధ్రులు వాషింగ్టన్‌ డీసీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. అధికారిక..వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లిన జగన్ పూర్తిగా సొంత ఖర్చులతో పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు..అధికారులతో పాటుగా కుటుంబ సభ్యులు సైతం జగన్ తో ఉన్నారు. భారత రాయబారి ముఖ్యమంత్రిని విందుకు ఆహ్వానించారు. అక్కడి ప్రవాసాంధ్రులతోనూ జగన్ సమావేశం కానున్నారు. అదే విధంగా తన రెండో కుమార్తె ను యూనివర్సిటీ చేర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. 17న డల్లాస్ లో ప్రవసాంధ్రులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రతినిధులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు.

 వాషింగ్టన్ లో జగన్ కు అపూర్వ స్వాగతం..

వాషింగ్టన్ లో జగన్ కు అపూర్వ స్వాగతం..

కుటుంబ సభ్యులు..అధికారులతో కలిసి అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కు వాషింగ్టన్ డీసీ విమానాశ్రమంలో ఘన స్వాగతం లభించింది. ప్రవాసాంధ్రులు ఆయనకు వాషింగ్టన్‌ డీసీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌) కూడా సీఎం జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. అమెరికా కాల మానం ప్రకారం ఈ ఉదయం 8.30 గంటలకు జగన్ అమెరికా చేరుకున్నారు. అదే భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం ఆరు గంటలకు ఆయన అక్కడికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ ను భారత రాయబారి విందు కు ఆహ్వానించారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. ఈ పర్యటనలో అమెరికాలోని ప్రముఖులతోనూ జగన్ సమావేశం కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు. అమెరికా చేరుకున్న జగన్ కు అక్కడి ప్రవాసాంధ్రులతో పాటుగా వైసీపీ అభిమానులు జై జగన్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు.

డల్లాస్ మీటింగ్ పైన జగన్ షరతు ఇలా..

డల్లాస్ మీటింగ్ పైన జగన్ షరతు ఇలా..

అమెరికాలో కొన్ని సంఘాల వారీగా ప్రవాసాంధ్రులు సమావేశాలు కొనసాగిస్తున్నారుద. జగన్ ను డల్లాస్ జరిగే సమావేశంలో పాల్గొనాలని అక్కడి ప్రవాసాంధ్రులు ఆహ్వానించగా..అందరూ ఒక్కటిగా తెలుగు వారంతా హాజరైతేనే తాను కార్యక్రమంలో పాల్గొంటానని జగన్ స్పష్టం చేసారు. దీంతో..తానా, ఆటా, తెలుగు సమాఖ్య, ఏపీఎన్నార్టీ వంటి సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఈ సమావేశం ఏర్పాటు చేసారు. డల్లాస్ లో జరిగే ఈ కార్యక్రమంలో అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలు పాల్గొంటున్నారు. ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్‌ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో తెలుగు వారు భారీ సంఖ్యలో పాల్గొనే ఈ సమావేశంలో జగన్ ఎటువంటి సందేశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారింది. అదే సమయంలో వైసీపీ ఎన్నారై విభాగం.. జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గురించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు ఈ సమావేశ బాధ్యతను స్వీకరించారు.

 అమెరికాలో జగన్ కార్యక్రమం ఇలా...

అమెరికాలో జగన్ కార్యక్రమం ఇలా...

ముఖ్యమంత్రి జగన్ డల్లాస్ కార్యక్రమం పూర్తి చేసుకున్న తరువాత కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఆగస్టు 18న వాషింగ్టన్‌ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు. తన రెండో కుమార్తెను అక్కడి యూనివర్సిటీలో చేర్పించేందకు ఇప్పటికే జగన్ తో పాటుగా కుటుంబ సభ్యులు సైతం అమెరికా చేరుకున్నారు.
ఇక, ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు వాణిజ్య ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు. 23న ముఖ్యమంత్రి స్వదేశానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి తో పాటుగా ఎంపీలు అవినాశ్ రెడ్డి..మిధున్ రెడ్డి..భరత్ అదే విధంగా మంత్రి సురేష్.. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక, అమెరికాలో ముఖ్యమంత్రి పర్యటన పైన ఇప్పుడు పార్టీలో ఆసక్తి నెలకొని ఉంది.

English summary
AP NRI's and YCP Fans grand Welcome for AP Cm Jagan in Wahington Dc airport. Jagan reached Washington along with family members and party leaders for Six days tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X