వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్..కేసీఆర్‌ ఆలోచ‌న‌ల‌పై ఎన్నారైల్లో అనుమానాలు: టీడీపీ అజెండాలోనేనా : ఉండ‌వ‌ల్లికి లేఖ‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో క‌లిసి కొత్త‌గా ప్ర‌తిపాదిస్తున్న నీటి పంప‌కా ల్లో ప్ర‌ణాళిక‌ల పైన ప్ర‌వాసాంధ్రులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా సీఎం చూపిస్తున్న చొర‌వ‌..వేస్తున్న అ డుగులు ఏపీకి మేలు చేస్తాయా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. లేక మ‌రోసారి మన వేలితో మన కన్నే పొడుచుకుంటున్నా మా అనే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వీటి పైన స్పందించాల‌ని.. అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు చేయాల‌ని కోరుతూ ప్ర‌వా సాంధ్రులు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లికి లేఖ రాసారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పైన ఆయ‌న స్పంద‌న‌..ముఖ్య‌మంత్రి ఆలో చ‌న‌ల పైన ప్ర‌భుత్వం నుండి మ‌రింగా స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

Recommended Video

కేసీఆర్ మూడ నమ్మకాల తో ప్రజల పై భారం
ప్ర‌వాసాంధ్రుల అనుమానాలు ఎందుకంటే..

ప్ర‌వాసాంధ్రుల అనుమానాలు ఎందుకంటే..

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. దీని పైన ఎవ‌రికీ అభ్యంత‌రం లేక పోయినా..నీటి వ‌న‌రుల వినియోగం పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రు లు చేస్తున్న క‌స‌ర‌త్తు పైనే ఏపీలో సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబు శాస‌న‌స‌భ లో ఈ అంశం పైన ప్ర‌స్తావించారు. సంబంధాలు బాగున్న స‌మ‌యంలో అంతా బాగుంటుంద‌ని..అయితే, భ‌విష్య‌త్‌లో ఏపీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. అయితే జ‌గ‌న్ మాత్రం ఇది ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఒప్పందం కాద‌ని..రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య జ‌రుగుతున్న ఒప్పందం అంటూ..అన్ని నిబంధ‌న‌లు ఖ‌రారైన త‌రువాత‌నే సంత‌కాలు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేసారు. ఇదే అంశం మీద తాజాగా క‌డ‌ప‌లో స‌మావేశ‌మైన వివిధ సంఘాల నేత‌లు సైతం అనుమానాలు వ్య‌క్తం చేసారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల ప్ర‌తిపాద‌న‌ల మీద మ‌రింత‌గా చ‌ర్చ చేయ‌టంతో పాటుగా..అనుమానాల‌ను నివృత్తి చేయాల‌ని సూచిస్త‌న్నారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ప్ర‌వాసాంధ్రులు సైతం అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఉండ‌వ‌ల్లికి లేక‌..నివృత్తి కోసం అభ్య‌ర్ద‌న‌

ఉండ‌వ‌ల్లికి లేక‌..నివృత్తి కోసం అభ్య‌ర్ద‌న‌

కాంగ్రెస్ మాజీ ఎంపీఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ప్రవాసాంధ్రులు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రయోజనాలు, గోదావరి జలాల గురించి ఈ లేఖలో ప్రవాసాంధ్రులు ప్రస్తావించారు. త‌మ సందేహాల నివృత్తికి ప్ర‌య‌త్నించాల‌ని కోరారు. ఈ లేఖ‌లో వారు ఏపీ ప్రయోజనాల కోసం తపించే వ్యక్తిగా ఉండ‌వ‌ల్లి అంటే త‌మక ఎంతో గౌరవం ఉంద‌న్నారు. విభజన సమయంలోనూ ఆ తరువాతి పరిణామాల్లోనూ.. సుప్రీంకోర్టు తలుపులు తట్టిన ఉండ‌వ‌ల్లిని చూసి ఇంకా గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు.. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే కొత్త ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయనే అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. మీ లాంటి మేధావులు స్పందించి వీటిపై మాట్లాడాలని ఉండ‌వ‌ల్లిని కోరారు. ఇవన్నీ రాష్ట్రానికి మేలు చేస్తాయా లేక మరోసారి మన వేలితో మన కన్నే పొడుచుకుంటున్నామా అనే విషయంపై బహిరంగంగా చర్చించాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పందించాలని లేఖలో ఉండవల్లిని ప్రవాసాంధ్రులు కోరారు.

జ‌గ‌న్ తొంద‌ర ప‌డుతున్నారా..

జ‌గ‌న్ తొంద‌ర ప‌డుతున్నారా..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో చ‌ర్చ‌ల సారాంశం గురించి స‌భ‌లో ప్ర‌స్తావించ‌టం మిన‌హా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా బ‌య‌ట పెట్ట‌టం లేదు. రాష్ట్ర అంశం కావ‌టంతో దీని పైన నిపుణుల‌తో స‌మావేశం లేదా దీని పైన త‌మ ఆలోచ‌న‌ల‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం భ‌విష్య‌త్‌లో న‌ష్టం చేస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు ఎన్నారైలు ఉండ‌వ‌ల్లికి రాసిన లేఖ వారి అనుమానాలేనా..లేక టీడీపీ అజెండాలో భాగంగా ఈ లేఖ రాసారా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్న ఉండ‌వ‌ల్లి ఇప్పుడు ఈ లేఖ ద్వారా స్పందిస్తారా లేక మిన్న‌కుండిపోతారా అనేది ఆయ‌నే స‌మాధానం చెప్పాలి.

English summary
AP NRI's letter to ex MP Undavalli Arun Kumar to clear the doubts which created on both CM's meetings and Planning on water sharing. Is it help for AP or not. Now Undavalli to be answer for this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X