వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హడావిడిగా ఏపీ అసెంబ్లీ ఎందుకన్న విపక్షాలు- గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగంపైనా విమర్శలు....

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం హడావిడిగా రెండు రోజుల పాటు నిర్వహిస్తుండటాన్ని విపక్ష పార్టీలు తప్పుబట్టాయి. సమగ్రమైన అజెండా లేకుండా కరోనా టైమ్ లో అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ప్రధాన విపక్షం టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గవర్నర్ హరిచందన్ సభకు హాజరు కాకుండా ఆన్ లైన్ ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడాన్ని సీపీఐ తప్పుబట్టింది.

ఏపీ అసెంబ్లీ ముందుకు మరోసారి రాజధాని బిల్లులు ? రేపు ప్రవేశపెట్టే అవకాశం...ఏపీ అసెంబ్లీ ముందుకు మరోసారి రాజధాని బిల్లులు ? రేపు ప్రవేశపెట్టే అవకాశం...

 హడావిడి సమావేశాలేంటన్న టీడీపీ...

హడావిడి సమావేశాలేంటన్న టీడీపీ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులతో ముగించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విపక్ష టీడీపీ మండిపడింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ నల్లచొక్కాలతో టీడీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీంతో అర్ధమవుతోందన్నారు. మొక్కుబడి సమావేశాలవల్ల ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు. ప్రభుత్వం కేవలం గవర్నర్ అడ్రస్, బడ్జెట్‌ను మమా అనిపించుకునే విధంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేశారని విమర్శించారు. చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను చర్చించాలనే ఉద్దేశం కనిపించలేదన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటిని చర్చించాలంటే ప్రభుత్వం తప్పకుండా వర్చువల్ సమావేశాలు జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

 గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగంపై...

గవర్నర్ ఆన్ లైన్ ప్రసంగంపై...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గవర్నర్ హరిచందన్ సభకు హాజరు కాకుండా ఆన్ లైన్ ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడాన్ని సీపీఐ తప్పుబట్టింది. గవర్నర్ సభకు హాజరు కాకుండా ఉభయసభల సభ్యులను అవమానపరిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

విమర్శించారు. సభకు కూడా హాజరు కాలేని గవర్నర్ ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు.
సీఎం జగన్ తీసుకొచ్చే తప్పుడు ఆర్డినెన్స్ లకు గుడ్డిగా సంతకాలు చేయటమే గవర్నర్ పనా అని రామకృష్ణ ప్రశ్నించారు.
తక్షణమే గవర్నర్ ను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Recommended Video

AP Assembly Budget Sessions Guidelines ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడూ చూసుండరు ?
 మండలిలోనూ నిరసనలు..

మండలిలోనూ నిరసనలు..

ఏపీలో వరుసగా జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టులపై శాసనమండలిలో ఆ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. సభను రెండు రోజులకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. మండలిలో రాజధాని బిల్లులపై ఏదో ఒకటి తేల్చేందుకు సిద్దమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వంకానే సమావేశాలను కుదించిందని టీడీపీ ఆరోపించింది. మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లుల వ్యవహారాన్ని ఈ రెండు రోజుల్లోనే తేల్చేందుకు టీడీపీ మండలిలో ఇతర విపక్షాలతో కలిసి సంప్రదింపులు జరుపుతోంది.

English summary
opposition parties in andhra pradesh like tdp and cpi have expressed their displeasure over holding legislative assembly budget sessions in a hurry during coronavirus pandemic time. opposition questions govt's idea over holding the sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X