ఓటీఎస్ పై అదే రగడ: లబ్దిదారుల్లో సందిగ్ధం; మళ్ళీమళ్ళీ క్లారిటీ ఇస్తున్న మంత్రులు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటిఎస్ పై రగడ కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధి జరుగుతుందని వైసీపీ నేతలు, వన్ టైం సెటిల్మెంట్ ద్వారా నిరుపేదలైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అసలు వన్ టైం సెటిల్మెంట్ కట్టాలా వద్దా? దీని వల్ల జరిగే లబ్ధి ఏంటి? కట్టకుంటే జరిగే నష్టమేంటి? అన్నదానిపై ప్రస్తుతం ఏపీలో లబ్ధిదారులు గందరగోళంలో ఉన్నారు. ఇక అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్న మాటలతో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
గోరంట్ల
బుచ్చయ్య
చౌదరికి
మంత్రి
బొత్సా
సత్యన్నారాయణ
సవాల్;
చంద్రబాబుకు
చురకలు

ఓటీఎస్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన జగన్ సర్కార్ ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల నుండి నాటి రుణాలను వన్ టైం సెటిల్మెంట్ పేరుతో చెల్లిస్తే లబ్ధిదారులకు ఇంటి పై హక్కు పత్రాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని వెల్లడించింది. అయితే అసలే కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయించిన మొత్తం కట్టడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అప్పుడెప్పుడో తీసుకున్న లోన్లు ఇప్పుడు చెల్లించమని అడుగుతున్నారు అంటూ పెద్ద ఎత్తున దుమారం నెలకొంది.

డబ్బులు చెల్లించాలి అంటే ప్రజల్లో అసహనం .. ప్రతిపక్షాలు ధ్వజం
డబ్బులు చెల్లించాలి అంటే ప్రజల్లో వస్తున్న అసహనాన్ని చూసిన టిడిపి, బిజెపి నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తు తున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని, ఎవరు ఎలాంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. బిజెపి నాయకులు సైతం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి , నిరుపేదలైన ప్రజల నుండి కూడా వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొన్నిచోట్ల సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని, ఖచ్చితంగా ఓటిఎస్ కట్టాలని లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసిపి మంత్రులకు పదేపదే ఓటిఎస్ పై క్లారిటీ ఇవ్వక తప్పడంలేదు.

ఓటీఎస్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్
ఇప్పటికే ఓటీఎస్ వ్యవహారంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇవ్వగా తాజాగా ఓటిఎస్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ మరోమారు క్లారిటీ ఇచ్చారు. ఓటిఎస్ పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడితే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఓటిఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని స్పష్టం చేశారు. ఎవరిని ఎలాంటి బలవంతానికి గురి చేయడం లేదని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఓటీఎస్ పై రాజకీయాలు మంచిది కాదని ప్రతిపక్షాలకు హితవు
ఓటిఎస్
కట్టని
వారికి
సంక్షేమ
పథకాలు
నిలిపివేశారని
తప్పుడు
ప్రచారం
చేస్తున్నారని,
ఇదంతా
అవాస్తవమని
పేర్కొన్న
ఆయన
ప్రభుత్వం
అందిస్తున్న
సంక్షేమ
పథకాలు
మింగుడుపడని
కొందరు
కావాలని
దుష్ప్రచారం
చేస్తున్నారంటూ
మండిపడ్డారు.
ఓటిఎస్
పై
రాజకీయాలు
చేయడం
మంచిది
కాదని
హితవు
పలికారు.
ఓటిఎస్
పై
చంద్రబాబు
చేస్తున్న
మోసపూరిత
ప్రకటనలు
నమ్మొద్దని,
చంద్రబాబు
అధికారంలోకి
వస్తే
ఫ్రీగా
రిజిస్ట్రేషన్లు
చేస్తామని
అంటున్నారని
మరి
పద్నాలుగేళ్ళు
సీఎంగా
ఉన్నప్పుడు
ఎందుకు
చేయలేదు
అంటూ
ప్రశ్నించారు
మంత్రి
అవంతి
శ్రీనివాస్.

ఓటీఎస్ విషయంలో ప్రజలు ఎవరి మాట వింటారో?
ఇక ఇదే సమయంలో భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని పేర్కొన్న మంత్రి అవంతి శ్రీనివాస్, ఇప్పటికి భీమిలిలో పదివేల మందికిపైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఇక ఓటిఎస్ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ స్కీమ్ పూర్తిగా నిరు పేద ప్రజల పూర్తి గృహ హక్కు కోసమేనంటూ స్పష్టం చేశారు. మరి ప్రజలు ఎవరి మాట వింటారు.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటీఎస్ కట్టొద్దు అంటున్న ప్రతిపక్షాల మాటకు విలువ ఇస్తారా? లేకా ప్రభుత్వం చెప్తున్న మాట వింటారా? అన్నది తెలియాల్సి ఉంది.