వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nimmagadda ఎత్తుకు పైఎత్తు: ద్వివేదీ, గిరిజాశంకర్‌పై కొత్త అస్త్రం: సర్వీస్‌కే మచ్చ తెచ్చేలా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆటను మొదలు పెట్టారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీని నిలిపివేసిన ఆయన.. కొత్త అస్త్రాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. వారి సర్వీస్ రికార్డులకే మచ్చ తీసుకొచ్చేలా కఠిన చర్యలను తీసుకోవడానికి ఆదేశాలను జారీ చేశారు. ఆ ఇద్దరు అధికారుల నిర్లక్ష్యం వల్ల 2021 ఓటర్ల జాబితా తయారు కాలేదని, ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో 3.61 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిమ్మగడ్డ వాళ్లకు మాత్రమే సొంతం: వదిలేస్తే బెటర్: అప్పుడే ఆయనపై విశ్వసనీయత: మాజీ సీఎస్నిమ్మగడ్డ వాళ్లకు మాత్రమే సొంతం: వదిలేస్తే బెటర్: అప్పుడే ఆయనపై విశ్వసనీయత: మాజీ సీఎస్

దీనికి గల కారణాలను వివరిస్తూ ఆరు పేజీల సుదీర్ఘ ప్రకటనను ఆయన విడుదల చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. విధి నిర్వహణలో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ తీవ్ర నిర్లక్ష్యాన్ని కనపర్చారని పేర్కొన్నారు. వారి అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. సర్వీసు, నిబంధనల ఉల్లంఘనగా దీన్ని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలసత్వం వహించినందున.. నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. సర్వీసు రికార్డుల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో ఆ ఇద్దరు అధికారులపై ఇది ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

AP Panchayat elections 2021: SEC proceedings on failure of the officials to update the Electoral Rolls

ఏపీ హైకోర్టులో బుధవారం విచారణకు రాబోతోన్న పిటీషన్ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే వాదనను వినిపించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మూడున్నర లక్షల మందికి పైగా కొత్త ఓటర్లకు అవకాశం ఇవ్వని విధంగా నిమ్మగడ్డ..

ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారని, 20219 నాటి జాబితాతో పోలింగ్‌కు వెళ్లాల్సి రావడం వల్ల ఓటు హక్కు ఉన్నప్పటికీ.. జాబితాలో పేర్లను చేర్చలేదంటూ ధూలిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హౌస్ మోషన్ పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కొత్త జాబితాను రూపొందించడంలో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌ల అలసత్వమే కారణమంటూ వాదించవచ్చని సమాచారం.

English summary
Andhra Pradesh State Election Commission's proceedings on 'deliberate failure of the officials' to update the ElectoralRolls, a precursor to Panchayat Elections underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X