వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోగి రమేశ్ నోరు మూసుకోవాలి -ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం -‘స్కీములు కట్’ వ్యాఖ్యల ఫలితం -రచ్చ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం, జగన్ సర్కారుకు మధ్య రోజుకో సంచలన వివాదం తలెత్తుతూనే ఉంది. పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌజ్ అరెస్టు, మీడియా భేటీలపై నిషేధం వివాదం చల్లారిందనుకునేలోపే అధికార వైసీపీకే చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, డోసు తగ్గిందని ప్రతిపక్ష టీడీపీ రచ్చకు దిగింది. వివరాలిలా ఉన్నాయి..

కు.ని. నినాదంతో మోదీకి కౌంటర్ -3ముక్కలు, 2పేర్లలో సాగు చట్టాలు -రాహుల్ సంచలనం -శ్రద్ధాంజలికు.ని. నినాదంతో మోదీకి కౌంటర్ -3ముక్కలు, 2పేర్లలో సాగు చట్టాలు -రాహుల్ సంచలనం -శ్రద్ధాంజలి

ఎదురిస్తే స్కీములు కట్..

ఎదురిస్తే స్కీములు కట్..

పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాల అంశం వివాదాస్పదరంగా మారిన వేళ... వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్లు వేస్తే ప్రభుత్వ పథకాలు కత్తిరిస్తామంటూ పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వార్డు మెంబర్‎గా పోటీ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ ఆయన చేసిన కామెంట్లు గురువారం వైరల్ అయ్యాయి. ''మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారా?'' అని వాపోతూ, వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తామంటూ ఎమ్మెల్యే జోగి అన్న మాటలు ఇప్పుడు కలకలం రేపాయి. దీనిపై..

జోగిపై నిమ్మగడ్డ సీరియస్..

జోగిపై నిమ్మగడ్డ సీరియస్..

పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కామెంట్లపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎమ్మెల్యేకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. జోగి రమేశ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎస్‌ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా,

 చర్యలతో సరా? శిక్షలు లేవా?

చర్యలతో సరా? శిక్షలు లేవా?

వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే పథకాలు కత్తిరిస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, అందుకుగానూ ఆయనపై ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉన్నాయని ప్రతిపక్ష టీడీపీ వాపోయింది. ఎస్‌ఈసీ చర్యలపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్‌ఈసీ చర్యలు సంతృప్తిగా లేవని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఓటర్లను బెదిరించేలా జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఆంక్షలు కేవలం కంటితుడుపు మాత్రమేనన్న వర్ల.. ఎమ్మెల్యే జోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనంys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనం

English summary
State Election Commissioner Nimmagadda Ramesh Kumar had restriction orders on ruling YSRCP Pedana MLA Jogi Ramesh from meeting and speaking to people till February 17. Nimmagadda issued these orders following ‘serious complaints’ against the MLA from three major political parties. A few days ago, he had issued similar orders against Minister for Panchayat Raj Peddireddy Ramachandra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X