వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ ఎన్నికల వేళ.. బీజేపీ కీలక నిర్ణయం: లంకా దినకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేత: బరిలో

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ నాయకుడు లంకా దినకర్‌పై ఇదివరకు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలను జారీ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో.. ఆయన సేవలు పార్టీకి అవసరం అవుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

 కీలక భేటీ: గవర్నర్‌తో నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం: 15 నిమిషాల తేడాతో కీలక భేటీ: గవర్నర్‌తో నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం: 15 నిమిషాల తేడాతో

నిజానికి-లంకా దినకర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆ పార్టీలో సుదీర్గకాలం పాటు కొనసాగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాాన్ని కోల్పోయిన కొద్దిరోజుల్లోనే టీడీపీని వీడి బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న నేతల్లో ఆయనా ఒకరు. బీజేపీలో ఉంటూ పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా.. టీడీపీ లైన్‌కు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. టీవీ ఛానళ్లు నిర్వహించే డిబేట్లలో పార్టీ లైన్‌కు భిన్నంగా వాదనలను వినిపిస్తున్నారనే కారణంతో గత ఏడాది లంకా దినకర్‌పై క్రమశిక్షణా చర్యలను తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

AP Panchayat elections: BJP Chief Somu Veerraju has revoke suspension on Lanka Dinakar

అప్పటి నుంచీ లంకా దినకర్ పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లో కనిపించిన సందర్భాలు లేవు. తాజాగా ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తి వేసింది. ఇకపై పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తిరుపతి లోక్‌సభ బైపోల్, పంచాయతీ ఎన్నికల నగారా మోగిన వేళ.. లంకా దినకర్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended Video

AP Supports Farmers Kisan Tractor Rally | Oneindia Telugu

English summary
In the row of Panchayat elections in the State, AP BJP Chief Somu Veerraju has decided to revoke the suspension on Party leader Lanka Dinakar. BJP State Office has issued a statement and said that Lanka Dinakar to build and strengthen the party in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X