తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య చెలరేగిన తాజా వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌజ్ అరెస్టుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. అదే సమయంలో మంత్రిపై విధించిన ఆంక్షల్లో కొన్నిటిని కోర్టు సమర్థించింది. వివాదం, కోర్టులో సాగిన వాదనలు, తీర్పు సారాంశం వివరాలిలా ఉన్నాయి...

Recommended Video

#peddireddy #ap నిమ్మగడ్డకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు!

హౌజ్ అరెస్టు: నిమ్మగడ్డకు హైకోర్టు ఝలక్ -రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి -'ప్రివిలేజ్' ప్రతీకారంహౌజ్ అరెస్టు: నిమ్మగడ్డకు హైకోర్టు ఝలక్ -రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి -'ప్రివిలేజ్' ప్రతీకారం

 నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ..

నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ..

ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని రెండు వారాలపాటు(ఈనెల 21 వరకు) నిర్బంధిస్తూ శనివారం ఎస్ఈసీ జారీచేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు చెల్లవంటై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పునిచ్చింది. కాగా..

పంచాయితీ మంత్రి లేకుంటే ఎలా?

పంచాయితీ మంత్రి లేకుంటే ఎలా?

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ శాఖకు మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఉందని, ఇలాంటి సమయంలో మంత్రిని ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగ విరుద్ధమంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఎన్నికల నేపథ్యంలో మంత్రిని కట్టడి చేయడం సరికాదని, రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. మంత్రి హౌజ్ అరెస్టుపై ఎస్ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే, విచారణలో మాత్రం..

 ఏకగ్రీవాలు, నోటీసుల చుట్టూ వాదనలు..

ఏకగ్రీవాలు, నోటీసుల చుట్టూ వాదనలు..


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌజ్ అరెస్టు వివాదంపై ఆదివారం హైకోర్టులో సాగిన వాదనలు ప్రధానంగా ఏకగ్రీవ పంచాయితీలు, ముందస్తు నోటీసులు అంశాల చుట్టూ తిరిగాయి. రాజ్యాంగ విరుద్ధం అని మంత్రి వ్యాఖ్యలపై ఎస్ఈసీ చేస్తోన్న ఆరోపణలు సమంజసం కావని, ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయని, ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ విధానం కాబట్టి మంత్రి ఆ మేరకు ప్రకటనలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయినా, ముందస్తుగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా మంత్రిని ఇంటికే పరిమితం కావాలని ఉత్తర్వులివ్వడం చెల్లబోవని వాదించారు. దీనికి ప్రతిగా..

ఆ అధికారం ఎస్ఈసీకి ఉంది..

ఆ అధికారం ఎస్ఈసీకి ఉంది..

పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగులను ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్‌ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే ప్రకారం ఈమేరకు మంత్రి పెద్దిరెడ్డిని ఈనెల 21 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని ఎస్ఈసీ ఆదేశిచారే తప్ప, ఆయన విధులను ఆటంకపర్చడానికి కాదని, ప్రెస్ మీట్లలో మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎస్ఈసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై..

మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆంక్షలు

మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆంక్షలు

పంచాయితీ ఎన్నికల వేళ ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిర్బంధించడం సబబు కాదన్న హైకోర్టు.. ఆయన వ్యాఖ్యలను మాత్రం గర్హించింది. హౌజ్ అరెస్టుకు అనుబంధంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రం హైకోర్టు సమర్థించిడం గమనార్హం. మంత్రి పెద్దిరెడ్డి ప్రెస్ మీట్లపై ఆంక్షలు వాటిలో ముఖ్యమైనది. ఇప్పటికే పరిధిదాటి వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి ఇకపై మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదన్న ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. మంత్రి నిరభ్యంతరంగా ఎక్కడికైనా తిరగొచ్చన్న కోర్టు.. ఆ సమయంలో ఆయన ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయితే, ఈ ఆంక్షలు ఎన్నికలు పూర్తయ్యేవరకు వర్తిస్తాయా? ప్రెస్ మీట్ల ఆంక్షలపై మంత్రి మరోసారి కోర్టుకు వెళతారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీటిని తీవ్ర ఆంక్షలుగానే పరిగణించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణఅడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణ

English summary
State Election Commissioner Nimmagadda Ramesh Kumar has faced a major setback in the Andhra Pradesh High Court. The court on Saturday quashed the orders issued by state panchayati raj minister Peddireddy Ramachandra Reddy detaining him. The SC ruled that Peddireddy house arrest warrant was invalid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X