వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కందరాడలో ఫిబ్రవరి 13న రీపోలింగ్: బ్యాలెట్ పత్రాల అపహరణే కారణం

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: పిఠాపురం మండలం కందరాడలో ఫిబ్రవరి 13న రీపోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి కందరాడలో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు అక్రమంగా కేంద్రంలోకి చొరబడి చివరి రౌండ్ బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు.

ఈ క్రమంలో తనకు అన్యాయం జరిగిందని టీడీపీ మద్దతుదారు, అభ్యర్థి పిల్ల సుశీల ఆందోళన చేపట్టారు. అంతేగాక, తననే విజేతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే, కౌంటింగ్ జరగకుండా సర్పంచ్‌ను ప్రకటించలేమంటూ అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. అనంతరం బుధవారం ఉదయం 6గంటలకు రీకౌంటింగ్ నిర్వహించి పోలైన ఓట్లను సరిచూశారు.

 AP panchayat elections: repolling in kandarada Feb 13th

సుమారు 43 బ్యాలెట్ పత్రాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్వో ప్రకాశ్ రావు, ఆర్డీవో చిన్నికృష్ణ, డీఎస్పీ భీమారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అభ్యర్థి సుశీల తమ వర్గీయులతో కాకినాడకు తరలివెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.

ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్.. ఫిబ్రవరి 13న కందరాడలో రీపోలింగ్‌కు ఆదేశించారు. మరోవైపు, బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లిన ఘటనలో ఆర్వో ప్రకాశ్ రావు ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఐదుగురిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.

English summary
AP panchayat elections: repolling in kandarada Feb 13th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X