• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంచాయితీ షాకింగ్: జగన్ సర్కారు పరువు పోయింది -I&PR అధికారిక ప్రకటనలో తెలంగాణ ఫొటోలు

|

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపు ఏడాదిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదాలు కొనసాగడం, హైకోర్టు తీర్పులపై జగన్ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికలు జరుగుతున్న దరిమిలా ఈ వ్యవహారాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఇటు ఎస్ఈసీగానీ, అటు ప్రభుత్వంగానీ వెలువరించే ప్రకటనల్లో ప్రతి మాటకు విశేష ప్రాధాన్యం నెలకొన్నవేళ ఓ షాకింగ్ వ్యవహారం చోటుకుంది. ఇప్పటికే వైసీపీని టార్గెట్ చేస్తోన్న ప్రతిపక్షాలు.. తాజా షాకింగ్ వ్యవహారంతో జగన్ సర్కారు పరువు గంగలో కలిసిపోయిందని, రాష్ట్ర ప్రతిష్ట మంటగలిపారని మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఇవి మన ఎన్నికలంటూ..

ఇవి మన ఎన్నికలంటూ..

పంచాయితీ ఎన్నికలపై కోర్టు వివాదాల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ విజయం సాధించడంతో అనివార్యంగానైనా ఏపీ ప్రభుత్వం ప్రక్రియకు సిద్ధమైంది. నిమ్మగడ్డ తీరుపై, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఇంకా సందిగ్ధాలు ఉన్నప్పటికీ, కోర్టు తీర్పు మేరకే ఎన్నికలకు సహకరిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. ప్రక్రియకు సంబంధించి ఎస్ఈసీతో చీఫ్ సెక్రటరీ ఇప్పటికే సహకారాత్మక మోడ్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏకగ్రీవ పంచాయితీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దానికి సంబంధించి బుధవారం అన్ని ప్రధాన పత్రికల్లో ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనను జారీ చేసింది. ‘ఇవి మన పంచాయితీ ఎన్నికలు' అంటూ జారీ అయిన ఆ ప్రకటనలో ఓ బ్లండర్ మిస్టేక్ చోటుచేసుకుంది..

 పెంచిన ప్రోత్సహకాలతో I&PR యాడ్

పెంచిన ప్రోత్సహకాలతో I&PR యాడ్

రాష్ట్రంలో పంచాయితీల ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ, పెంచి ఇస్తున్న ప్రోత్సాహకాల వివరాలతో ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ వారు బుధవారం అన్ని ప్రధాన పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. అందులో.. ‘‘ఇవి పార్టీ రహిత ఎన్నికలు.. పార్టీలకు అతీతంగా జరుగుతోన్న ఎన్నికలు.. ఇవి మన పంచాయితీ ఎన్నికలు.. పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం.. ఏకగ్రీవాలతో ప్రశాంతమైన గ్రామాలు, అన్నదమ్ముల్లా ప్రజలు.. కలిసి మెలసి ఉందాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం.. కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉందాం.. ఏకగ్రీవానికి అర్థం 100 శాతం ఆమోదం.. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి మరింత బలం చేకూర్చుకుందాం.. ఏకగ్రీవాలంటే ఎన్నికల ప్రక్రియలో పరిపూర్ణ మద్దతుకు నిదర్శనం.. గ్రామ పంచాయితీల సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో ఎకగ్రీవాలను ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నదానికన్నా ప్రోత్సాహకాలను పెంచి ప్రకటించింది.. '' అని సదరు ప్రకటనలో రాసుకొచ్చారు. అంతేకాదు..

 రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు..

రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు..

2వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం అయితే ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.5లక్షలు ఇస్తుందని, 2 వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయితీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10 వేలలోపు జనాభా ఉంటే రూ.15లక్షలు, అదే, 10వేలకంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయితీలు ఏకగ్రీవం అయితే రూ.20లక్షలు ప్రోత్సహకంగా ఇస్తామని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఏకగ్రీవాలపై ప్రభుత్వం సదుద్దేశాన్ని ప్రకటించినప్పటికీ.. ఆ ప్రకటనలో వాడిన ఫొటోలపై మాత్రం పెను దుమారం చెలరేగింది..

తెలంగాణ ఫొటోలతో ఏపీ ప్రకటన..

తెలంగాణ ఫొటోలతో ఏపీ ప్రకటన..

పంచాయితీల ఏకగ్రీవాలపై ఏపీ ప్రభుత్వం (సమాచార, పౌర సంబంధాల శాఖ)వారు పత్రికలకు జారీ చేసిన ప్రకటనలో ఐడియల్ గా వాడిన పంచాయితీ భవనం ఫొటో తెలంగాణది కావడం, ఆ భవంతిపై తెలంగాణ రాజముద్ర కూడా ఉండటంతో ఏపీ సర్కారు పప్పులో కాలేసినట్లయింది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలు వివాదాస్పదం కావడం, వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లి జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైన వేళ.. ప్రభుత్వం జారీ చేసిన కీలక ప్రకటనలో ఇలాంటి పొరపాటు సర్కారును నవ్వులపాలు చేసిందనే కామెంట్లు వస్తున్నాయి. సదరు ప్రకటనను ఎవరు రూపొందించారనేది తెలియనప్పటికీ, జారీ చేసింది మాత్రం సమాచార, పౌర సంబంధాల శాఖ కావడంతో ప్రతిపక్ష పార్టీలు సీఎం జగన్ పై ఎద్దేవా బాణాలు వేస్తున్నాయి. ఈక్రమంలో..

 అద్దెకు తెలంగాణ ఆఫీసులు..

అద్దెకు తెలంగాణ ఆఫీసులు..

పంచాయితీల ఏకగ్రీవాలపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో తెలంగాణ రాజముద్రతో కూడిన భవంతుల ఫొటోలు ఉండటాన్ని బీజేపీ నేత సాధినేని యామిని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఇందుకేనా పంచాయతీ ఎలక్షన్స్ అంటే వణికిపోతున్నారు. ఇప్పటివరకు అభివృద్ధి శూన్యం అని ప్రజలు, ప్రతిపక్షాలు అంటుంటే కొట్టిపారేసిన ప్రభుత్వం, వైసీపీ పార్టీ.. నిజంగా అభివృద్ధి అనేది చేయలేదేమో పాపం.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ప్రచార వాహనాలను అద్దెకు తెచ్చుకున్న తరహాలోనే ఇవాళ్టి పంచాయితీ ఎన్నికల ప్రకటనల కోసం కూడా పక్క రాష్ట్ర ఆఫీస్ ఫోటోలు కూడా అద్దెకు తీసుకుని, ప్రభుత్వమే ప్రజల డబ్బుతో ఇలా ప్రకటన వేయించుకున్నారు. వేరే దినపత్రికలో అంటే మార్ఫింగ్ అంటారేమో.. సాక్షాత్తు వాళ్ళ సొంత పేపర్ లోనే వేశారు'' అంటూ యామిని ఎద్దేవా చేశారు. మరోవైపు..

ఏపీ బొమ్మని పెట్టండి మహా ప్రభో..

ఏపీ బొమ్మని పెట్టండి మహా ప్రభో..

ఏకగ్రీవాలపై తొలి నుంచీ విమర్శలు చేస్తోన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైతం బుధవారం నాటి ప్రభుత్వ ప్రకటనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ను ట్యాగ్ చేస్తూ ఐ అండ్ పీఆర్ యాడ్ పై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ వ్యవహారం అధికారిక వేలం పాటలో పాల్గొనాలని చెబుతున్నట్లుగా ఉంది. ఏకగ్రీవ పంచాయితీలకు మీరు(ప్రభుత్వం) ఇచ్చే ప్రోత్సాహకాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరికి తెలీదు! కోట్లాది రూపాయలు కుమ్మరించి యాడ్స్ ఇస్తోన్న ప్రభుత్వం వారు.. కనీసం అక్కడ 'తెలంగాణా'బొమ్మ కాకుండా ఆంధ్రప్రదేశ్ బొమ్మ ని పెట్టండి మహా ప్రభో..''అని గోరంట్ల రాసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల ప్రకటనలో తెలంగాణ రాజముద్రతో కూడిన భవంతి ఫొటోను వాడటంపై ఏపీ ఐ అండ్ పీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంది.

  AP Panchayat Elections Candidates Eligibility పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు, అనర్హులు ఎవరు?.

  English summary
  andhra pradesh govt faces backlash from opposition parties when telangana photos shown in an official advertiser on ongoing panchayat elections. bjp leader sadineni yamini and others slams cm jagan for using telangana pics
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X