• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్..నేను పోటుగాడినే: నీలా కాదు: చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్: జగన్ ఫోబియాలో

|

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. ఎదుర్కొంటోన్న తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితేమిటనేది తేలిపోయిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఇదివరకెప్పుడూ లేనంతగా సజావుగా సాగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడటానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర పన్నారని ఆయన విమర్శించారు.

మంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్‌కు ఎస్ఈసీమంత్రి పెద్దిరెడ్డి సూచనలను నిమ్మగడ్డ పాటిస్తారా?: చంద్రబాబు సొంత జిల్లా టూర్‌కు ఎస్ఈసీ

వారిద్దరి దౌర్జన్యాలు కనిపించట్లేదా?

వారిద్దరి దౌర్జన్యాలు కనిపించట్లేదా?


తొలి విడత ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు జీర్ణం కావట్లేదని, అందుకే తన అక్కసును వెల్లబోసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫోబియాలో చంద్రబాబు కొట్టుకుని పోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, ప్రజలు స్వచ్ఛందంగా తమ పార్టీకి ఓటు వేస్తున్నారని చెప్పారు.

 నేను పోటుగాడినే..

నేను పోటుగాడినే..

వలంటీర్ల ద్వారా ప్రభుత్వమే లబ్దిదారుల ఇళ్లకు వెళ్తోందని, సంతృప్తికర స్థాయిలో పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చంద్రబాబు తనకు పోటుగాడు అనే బిరుదు ఇచ్చారని, దాన్ని తాను స్వీకరిస్తున్నానని పెద్దిరెడ్డి అన్నారు. తాను పోటుగాడినేనని స్పష్టం చేశారు. చంద్రబాబులాగా వెన్నుపోటుగాడిని మాత్రం కాదని చురకలు అంటించారు. 1996లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, వైఎస్ జగన్ ఛరిష్మాతో జిల్లాలో తనకు ప్రజాబలం ఏర్పడిందని అన్నారు. చంద్రబాబు ఏరోజైనా భారీ మెజారిటీతో విజయాలను సాధించారా? అని ప్రశ్నించారు.

సవాల్ చేసి మరీ గెలిపించా..

సవాల్ చేసి మరీ గెలిపించా..

తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఏ ఎన్నికలోనూ చంద్రబాబుకు భారీ మెజారిటీ లభించలేదని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లో చిత్తూరు జిల్లాలో తమ పార్టీ క్షేత్ర స్థాయిలో పట్టు లేనప్పటికీ.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సవాల్ చేసి మరీ.. తాను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించానని, తనకు ఆ సత్తా ఉందని పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు అలాంటి ఓటుబ్యాంకు ఉందా? నిలదీశారు. 90 శాతం మేర హామీలు అమలు చేస్తున్నామని, అవన్నీ అదే స్థాయిలో ప్రజలకు చేరాయని అన్నారు.

ఇంకా మూడు దశల ఎన్నికలున్నాయ్..

ఇంకా మూడు దశల ఎన్నికలున్నాయ్..

వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పకుండా.. మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తున్నారని చెప్పారు. అలా మేనిఫెస్టోలోని హామీలను చంద్రబాబు ఏనాడూ అమలు చేయలేదని అన్నారు. అందుకే తమ పార్టీకి ప్రజలే అండగా ఉన్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు ఓర్చుకోలేకపోతోన్నారని మండిపడ్డారు. తొలివిడత ఎన్నికల ఫలితాలకే చంద్రబాబు ఇలా అయిపోతే.. ఇక మిగిలిన మూడు దశల ఫలితాలను చూస్తే ఇంకెలా తయారవుతారోనని వ్యాఖ్యానించారు. మిగిలిన మూడు దశల ఎన్నికల ఫలితాలు ఇలాగే వస్తాయని పెద్దిరెడ్డి అన్నారు.

English summary
AP Panchayat minister Peddireddy Ramachandra Reddy slams TDP Chief Chandrababu Naidu for his claiming majority Panchayats gain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X