జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వోద్యోగులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య రచ్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ నోటిఫికేషన్ పై ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వర్తించలేమని తేల్చి చెబుతున్నారు .

ప్రాణాపాయం వస్తే ఎవరినైనా చంపే హక్కు ఉందన్న ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ప్రాణాపాయం వస్తే ఎవరినైనా చంపే హక్కు తమకు ఉందని, తమ ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం తమకు ఇచ్చిందని వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై టీడీపీ సోషల్ మీడియా మండిపడుతోంది.
ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రాణాపాయం ఉంటే చంపటానికి అయినా హక్కు ఉందని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది టిడిపి.
ఏపీ పంచాయితీ పోరు : గ్రామ వాలంటీర్లను టార్గెట్ చేస్తూ , తెర మీదకు కొత్త డిమాండ్లు

రోజురోజుకూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల రెచ్చిపోతున్నారు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యంతో ఉన్నాయని మండిపడింది. సోషల్ మీడియా వేదికగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పై టిడిపి నిప్పులు జరిగింది. ఆయన పోకడలు రోజురోజుకీ శృతిమించుతున్నాయని మండిపడింది. రోజురోజుకూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట రామిరెడ్డి రెచ్చిపోతున్నారు అంటూ వ్యాఖ్యానించిన టిడిపి ఆయనపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించింది.

జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల .. ఎవర్ని చంపుతారు ?
జగన్ రెడ్డి స్కూల్ నుంచి వచ్చిన కాకర్ల అవసరమైతే చంపేస్తామంటున్నారు.
కాకర్ల వెంకట్రామిరెడ్డి ఎవర్ని చంపుతాడు ..నిమ్మగడ్డ గారినా ? హైకోర్టు జస్టిస్ లనా ? సుప్రీం కోర్ట్ జస్టిస్ లనా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. అంతేకాదు ఇప్పటివరకు కరోనా కాలంలో ఎన్నికల విధుల్లో పనిచేసిన వివిధ రాష్ట్రాల ఉద్యోగులు ఇలాగే అన్నారా ? జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మాత్రం చంపేస్తాం అంటున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ సోషల్ మీడియా విభాగం నిప్పులు చెరుగుతోంది. కాకర్ల వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

పంచాయితీ ఎన్నికల విషయంలో ఏపీలో కొనసాగుతున్న రచ్చ
స్థానిక సంస్థల ఎన్నికలు వద్దని అటు ప్రభుత్వం , ప్రభుత్వోద్యోగులు , నిర్వహించి తీరాలని ఇటు ఎన్నికల సంఘం , టీడీపీ పట్టు పడుతున్న తీరు ఏపీలో ఆందోళనకరంగా మారింది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా సీరియస్ గా ఉన్నారు . మరోపక్క సర్కార్ ఎన్నికల నిర్వహణ ఆపాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. సుప్రీం కోర్టులో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తుంది .