వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌లకు సిద్దం : ఓట్ల విష‌యంలో జాగ్ర‌త్త : జ‌గ‌న్ కు ఒక్క సీటు వ‌చ్చినా కేసీఆర్ దే..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌టంతో తెలుగు దేశం పార్టీ ఏపిలో ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌ని ధీమా వ్య‌క్తం చేసారు. అంద‌రికీ అభివృద్ది ఫ‌లాల‌ను అం ద‌చేసామ‌ని వివ‌రించారు. ఏపిలో ఉండ‌కుండా ఏపిలో ఓట్లు అడుగుతున్న వైసిపి నేత‌ల‌కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసి న‌ట్లేన‌ని చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌లకు మేము సిద్దం..
ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌టంతో తాము ఎన్నిక‌లకు సిద్దంగా ఉన్నామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు. ఐదేళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశామని, అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని అందించామని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను నెరవేర్చకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఐదేళ్ల పాలనలో సమర్థవంతంగా పని చేశామని చంద్రబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 9 వేలు ఇచ్చామ ని సీయం అన్నారు.

Ap people are with us : Ready for Ballot battle..: Chandra babu

ఏపీ విషయంలో తెలంగాణ, కేంద్రం ఆర్థిక ఉగ్రవాదుల్లా ప్రవర్తించాయని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన సమర్థవంతంగా పనిచేశామన్నారు. అర్హత ఉన్నా ఓటు హక్కులేని ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఐదు రోజుల పాటు ఓటుపై చాలా అప్రమత్తంగా ఉండాల‌న్నారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులుచంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులు

జ‌గ‌న్ కు ఓటు వేస్తే..

వైసిపికి ఓటు వేస్తే కేసీఆర్ కు వేసిన‌ట్లేన‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చే డ‌బ్బుల కోసం ఏపిని ఆయ‌న వ‌ద్ద తాక‌ట్లు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఏపిలో ఉండ‌టానికి ఇష్టం లేని వారికి ఏపి ప్ర‌జ‌ల ఓట్లు ఎలా అడుగుతార‌ని నిల‌దీసారు. ఓట్ల దొంగ‌లు ఉన్నార‌ని..ఓట్లు తీసేయిస్తార‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో ఏపికి చెందిన వారి పై దాడులు జ‌రిగాయ ని..తిరిగి ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వివ‌రించారు. వైసిపి లో డ‌బ్బు ఉన్న వారికే సీట్లు కేటాయిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఏపి ప్ర‌జ‌లు త‌మ‌తోనే ఉన్నార‌ని..ఖ‌చ్చితంగా తాము విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.

English summary
Ap Cm Chandra Babu announced his prepareness for elections. After election schedule release Chandra Babu appealed for enrollment of votes who are not in voters list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X