వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

breaking:జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, శంషాబాద్‌లో అదుపులోకి, అనంతపురం తరలింపు..

|
Google Oneindia TeluguNews

గతకొంతకాలంగా రవాణాశాఖ కళ్లు గప్పుతున్నారని జేసీ ట్రావెల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కేసులు నమోదు చేసింది. కొన్ని వాహనాలు కూడా సీజ్ చేసింది. అయితే జేసీ ట్రావెల్స్ యజమాని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని శంషాబాద్‌లోని వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

అస్మిత్ రెడ్డి కూడా

అస్మిత్ రెడ్డి కూడా

జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డిని శంషాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో అనంతపురం తరలిస్తున్నారు. నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అస్మిత్ రెడ్డి, బీఎస్-4 వాహనాలుగా మార్చడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి ఏఫీకి తరలించారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ ఇవాళ తాడిపత్రి కోర్టులో హాజరుపరచే అవకాశం ఉంది.

సరికాదు

సరికాదు

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్‌ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీపవన్ రెడ్డి ఖండించారు. పోలీసుల ఆరోపణకు సంబంధించి విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని బాబాయ్ ప్రకటించారని గుర్తుచేశారు. అయినా అరెస్ట్ చేయడం ఏంటీ అని నిలదీశారు. విచారణకు సహకరిస్తానని చెప్పిన వినకుండా అదుపులోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. చిన్నాన్న ఆరోగ్యం కూడా సరిగా ఉండదని తెలిపారు.

 వారిని ఎందుకు వదిలేశారు

వారిని ఎందుకు వదిలేశారు

ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు వేరే ఉన్నారని పవన్ రెడ్డి తెలిపారు. తమకు మోసంగా వాహనాలు విక్రయించిన అకోశ్ లేలాంట్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఇందులో మధ్యవర్తిత్వం వహించిన ముత్తును కూడా విచారించడం లేదు పేర్కొన్నారు. కానీ తమపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

Andhra Pradesh ప్రభుత్వానికి BJP సపోర్ట్!!
4

4

జేసీ అండ్ కో నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ కేసుల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు ఫైల్ కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై మరో 27 కేసులు కూడా ఉన్నాయి.

English summary
ap police arrest by ex mla jc prabhakar reddy on bs-4 vehicle change issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X