వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి.. ఆనందంలో పార్టీ శ్రేణులు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇలాంటి కార్యక్రమాలకు పోలీసు అనుమతి తప్పనిసరి అని తాము పేర్కొన్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు.

 AP Police given permission to Jagan's Padayatra.. YCP Cadre in Celebrations

జగన్ పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. అంతేకాదు, ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పని సరి అని ఆయన స్పష్టం చేశారు.

పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ ను పోలీసులకు అందజేయాల్సి ఉంటుందని సాంబశివరావు పేర్కొన్నారు.

English summary
AP DGP Sambasiva Rao told that they granted permission for YCP Chief Jagan's Maha Padayatra. He also told that YCP Leaders applied for police permission and in Padayatra YCP Leaders and Cadre should follow the guidelines given by the Supreme Court. According to the guidelines YCP leades should submit their route map of Padayatra to police officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X