వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ పోలీస్ సరికొత్త యాప్ తో ..పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండానే ఫిర్యాదులు ..దేశంలోనే తొలిసారి

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సంచలనం నిర్ణయాలతో, సరికొత్త విధానాలతో ముందుకు వెళుతోంది. పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ కొత్త యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్ కి వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం.

ఏపీలో మోగిన బడిగంట ... తొలిరోజు స్కూలుకు విద్యార్థులు .. కరోనా మార్గదర్శకాలతోనే క్లాసులుఏపీలో మోగిన బడిగంట ... తొలిరోజు స్కూలుకు విద్యార్థులు .. కరోనా మార్గదర్శకాలతోనే క్లాసులు

ఏపీ పోలీస్ సరికొత్త యాప్ ను ఆవిష్కరించిన సీఎం జగన్

ఏపీ పోలీస్ సరికొత్త యాప్ ను ఆవిష్కరించిన సీఎం జగన్

పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన ఈ యాప్ ను ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. తాడేపల్లి లో జరిగిన పోలీస్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ దేశంలోనే తొలిసారిగా ఎప్పుడైనా ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేసేందుకు వీలుగా యాప్ అందుబాటులోకి తెచ్చింది ఏపీ పోలీస్ శాఖ.

అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు .

అన్ని నేరాలపై ఆన్ లైన్ లోనే ఫిర్యాదు .

.
పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతూ, ఈ యాప్ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు పోలీసులకు మధ్య అనుసంధానంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ యాప్ లో ఉన్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని నేరాలపై ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాదు ఫిర్యాదు చేసిన వారికి రసీదులు కూడా పొందే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుంది.

పోలీస్ శాఖకు సంబంధించిన 87 రకాల సేవలు అందుబాటులో

పోలీస్ శాఖకు సంబంధించిన 87 రకాల సేవలు అందుబాటులో

ఫేస్ బుక్ , ట్విట్టర్, వాట్సాప్ ల ద్వారా ఫిర్యాదు చేయడమే కాకుండా, అత్యవసరమైతే వీడియో కాల్ కూడా చేసి పోలీసుల సహాయం కోరే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించింది పోలీస్ శాఖ. పోలీస్ శాఖకు సంబంధించిన 87 రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్న ప్రభుత్వం వివిధ కేసుల్లో దర్యాప్తు పురోగతిని, కేసులకు సంబంధించిన అరెస్టులను కూడా యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది . మహిళల భద్రత, సైబర్ భద్రత, రహదారి భద్రతకు సంబంధించిన అన్ని సేవలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

మహిళల రక్షణకు 12 రకాల సేవలు

మహిళల రక్షణకు 12 రకాల సేవలు

వివిధ కార్యక్రమాలకు సంబంధించిన నిర్వహణ అనుమతులు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ లు, పాస్ పోర్ట్ సేవలు, లైసెన్సులు , ఇతర వెరిఫికేషన్లన్నీ ఈ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి . పోలీస్ శాఖ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన ఈ యాప్ ద్వారా మహిళల రక్షణకు కూడా ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ రూపొందించినట్లుగా తెలుస్తుంది.

 పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పని లేదు .. నేరుగా ఫిర్యాదులు

పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పని లేదు .. నేరుగా ఫిర్యాదులు

అధునాతన టెక్నాలజీ ద్వారా నేరాల నియంత్రణకు శ్రీకారం చుట్టాలని, పోలీసు శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క కేసుకు సంబంధించిన వివరాలలో పారదర్శకత ప్రదర్శించాలని, అలాగే ఆన్లైన్ విధానంలో కూడా ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ పోలీస్ శాఖ ఈ యాప్ ను సిద్ధం చేసింది. ఇకనుండి సమస్య ఏదైనా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో ప్రజలు ఆన్ లైన్ లోనే చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తో తమ ఫిర్యాదులను చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ చేసిన ఈ యాప్ ద్వారా అన్ని జిల్లాల లోని పోలీసు శాఖల లోనూ సమన్వయంతో పని చేసే వెసులుబాటు కూడా కలుగుతుంది.

English summary
The Andhra Pradesh government has brought about administrative reforms, has embarked on an innovative program in the state police department. Developed a new app connecting all police stations in the state. The AP government has made available 87 types of services through this app. There is no need to go to the police station for the people .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X