వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై పోలీసు అసోసియేషన్‌ ఫైర్‌- నీతి మాలిన వ్యాఖ్యలు- కోర్టుకెళ్తామంటూ

|
Google Oneindia TeluguNews

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను ఉద్దేశించి విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఇవాళ తీవ్రంగా ఖండించింది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆయన పరిస్ధితి అర్ధం చేసుకోగమంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఆయనకు పోలీసులపై వ్యతిరేకత కొత్తేమీ కాదని పేర్కొంది. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం చేసిన కామెంట్స్‌ మరింత కాక రేపేలా ఉన్నాయి.

ఏపీలో పోలీసు బాస్‌ గౌతం సవాంగ్‌ను ఉద్దేశించి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీసులకు మంటపుట్టించాయి. దీంతో వారు ఇవాళ చంద్రబాబు కామెంట్స్‌ ఖండిస్తూ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. ఇందులో సంఘం నేతలు పోలీసులను, డీజీపీని బెదిరించి కుల, ప్రాంతీయ భావాలు రేకెత్తించి మా ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఎన్నికల ఓటమికి డీజీపీ, పోలీసు శాఖ బాధ్యత అనడం భావ్యమేనా అని చంద్రబాబును ప్రశ్నించారు.

ap police officers association condemn chandrababus remarks on dgp sawang

నలభయ్యేళ్ల రాజకీయ జీవితంలో పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న మీరు డీజీపీ గారిపై కుల, ప్రాంతీయ భేదాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేయడం గర్హనీయమని వారు చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపణలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఐపీఎస్ అధికారిగా 35 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్న డీజీపీ సవాంగ్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలో సవాంగ్‌ పనిచేసినప్పుడు ఆయన ప్రాంతం, కులం గుర్తుకు రాలేదా వారు చంద్రబాబుని ప్రశ్నించారు. మీ వ్యాఖ్యలు చట్ట ఉల్లంఘన కిందకు వస్తాయని, మీరు చట్టానికి అతీతులు కాదని తెలిపారు. ఇకనైనా ఇలాంటి అసంబద్ధ, నీతి మాలిన వ్యాఖ్యలు మానుకోకపోతే సంబంధిత చట్టాల ప్రకారం మీపై చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

English summary
andhra pradesh police officers association on friday condemn tdp chief chandrababu's comments against dgp gowtham sawang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X