వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం

|
Google Oneindia TeluguNews

వ్యక్తిగత కారణాల వల్ల సూసైడ్ కి పాల్పడిన గుడివాడ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడంపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీ నేతలు, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాలు ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యపై వక్రీకరించి చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయని వారు ఆరోపించారు. ఒక ఎస్సై ఆత్మహత్య చేసుకుంటే దానిపైన కూడా రాజకీయాలు చేస్తారా అంటూ పోలీసు అధికారుల సంఘం నేతలు టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

 పేకాట శిబిరాలపై దాడుల ఒత్తిడితో ఎస్సై ఆత్మహత్య అన్న ప్రచారంపై ఫైర్

పేకాట శిబిరాలపై దాడుల ఒత్తిడితో ఎస్సై ఆత్మహత్య అన్న ప్రచారంపై ఫైర్

విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీసు అధికారుల సంఘం నేతలు టిడిపి నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేకాట శిబిరాలపై దాడులు చేసిన కారణంగా, ఎస్సై పై ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారు అంటూ టిడిపి నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు.

 రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనాన్ని చూడలేదన్న పోలీసు రాష్ట్ర అధికారుల సంఘం

రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనాన్ని చూడలేదన్న పోలీసు రాష్ట్ర అధికారుల సంఘం

రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనాన్ని ముందు ఎప్పుడూ చూడలేదని పోలీసు రాష్ట్ర అధికారుల సంఘం నేతలు మండిపడ్డారు. ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసు ప్రాథమిక విచారణలో ఉందని, దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, కానీ టిడిపి నేతలు కావాలని కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎస్సై ఆత్మహత్యపై అవాస్తవాలు ప్రచారం చేసే వ్యక్తులపై న్యాయ పోరాటం చేయడానికి పోలీస్ అధికారుల సంఘం సిద్ధంగా ఉందని వారు స్పష్టం చేశారు.

 దేవినేని వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్

దేవినేని వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం, ఎస్సై ఆత్మహత్యపై రాజకీయ కారణాలను ఆపాదించటం దారుణమన్నారు. దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను బెదిరించి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, పోలీస్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసి హీరోలు అవుదామని భావించేవారు ఎప్పటికీ జీరోలు గానే మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Recommended Video

Devineni Uma Arrest at the NTR statue in Gollapudi | Oneindia Telugu

టీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా , కుల, మత పిచ్చితో ... చంద్రబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధ్వజంటీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా , కుల, మత పిచ్చితో ... చంద్రబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధ్వజం

English summary
Leaders of the Association of Police Officers, who held a press conference in Vijayawada, flagged down the TDP leaders' behavior. Janakula Srinivasa Rao, state president of the Police Officers' Association, outraged TDP leaders are trying to mislead the SI Suicide case, spreading untruths that he committed suicide because he could not bear the political pressure. demanded that Devineni's remarks be withdrawn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X