వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి:ఎపి అసెంబ్లీ సమావేశాల కోసం...డ్రోన్‌ కెమెరాల వినియోగం

|
Google Oneindia TeluguNews

గుంటూరు : మార్చి 5 నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా ఎపి అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా గుంటూరు అర్బన్ పోలీసులు భధ్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ కెమేరాలను వినియోగించబోతున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రాధాన్యత దృష్ట్యా ఈ సెషన్స్ కు ఏవిధమైన అవాంతరాలు ఎదురుకాకుండా సభ ఆసాంతం సజావుగా సాగేందుకు వీలుగా ఇలా డ్రోన్‌ కెమెరాలను వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ డ్రోన్లను తాడేపల్లి పరిధిలోని సిఎం చంద్రబాబునాయుడు నివాసం, ఉండవల్లి సెంటరు, మంగళగిరి జాతీయ రహదారిని పరిశీలించేందుకు వినియోగించనున్నారు.

AP Police plans drone based security for Assembly Budget Sessions

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో పాటుగా ఏ విదమైన ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నా, వీటి ద్వారా వెంటనే సమాచారం తెలుసుకోవడం కోసమే వీటిని వాడబోతున్నారు. అలాగే ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం మూడు అంచెల భద్రత చర్యలు చేపడుతున్నారు.

English summary
Amaravathi:Guntur Urban Police have decided to use drones in security measures taking into account of AP Assembly Budget Sessions. This is the first time that drones are used for assembly security in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X