వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో అప్లై చేయండి: ఏపీ పోలీస్ శాఖలో 4548 ఖాళీలు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీస్ నోటిఫికేష‌న్ ఏపీలో వెలువ‌డిన సంగతి తెలిసిందే. 4548 పోస్టుల భర్తీకి మాజీ డీజీపీ జేవీ రాముడు ప్రకటన విడుద‌ల‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 3216 సివిల్‌ కానిస్టేబుల్‌, 1067 ఆర్మ్‌డ్‌ రిజర్వుడు కానిస్టేబుల్‌, జైళ్లలో 240 పురుష వార్డర్‌, 25 మహిళా వార్డర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అక్టోబర్‌ 16న ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. సివిల్ మొత్తం ఖాళీల్లో 33.33 శాతం, ఏఆర్ ఖాళీల్లో 20 శాతం పోస్టుల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగం: పోలీసు
జాబ్ లోకేషన్: ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ: 14 Sep, 2016

పోస్టు వివరాలు: Stipendiary Cadet Trainee (SCT) Police Constables (Civil)(Men/Women)
ఖాళీలు: 3216

AP Police Recruitment 2016 Apply Online 4548 Vacancies

పోస్టు వివరాలు: Stipendiary Cadet Trainee(SCT) Police Constables (AR) (Men/Women) in Police Department
ఖాళీలు: 1067

పోస్టు వివరాలు: Warders (Male) in Prisons and Correctional Services Department
ఖాళీలు: 240

పోస్టు వివరాలు: Warders (Female) in Prisons and Correctional Services Department
ఖాళీలు: 25

ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్ దరఖాస్తు: ఆగస్టు 3, 2016 నుంచి సెప్టెంబరు 14, 2016 వరకు
* ప్రిలిమినరీ రాతపరీక్ష: అక్టోబరు 16, 2016 ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గం.

ప్రిలిమినరీ:
కానిస్టేబుల్ ఉద్యోగానికి తొలి మెట్టు ప్రిలిమినరీ. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్, ఫైనల్ పరీక్ష సిలబస్ ఒక్కటే. ఇందులో అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర- సంస్కృతి- భారత స్వాతంత్య్రోద్యమం, భారత భౌగోళికశాస్త్రం, పాలిటీ, ఎకానమీ, జాతీయ- అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన వర్తమానాంశాలుంటాయి. ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించారు. పరీక్షను 3 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ షీటుపై నలుపు/ నీలిరంగు పెన్నుతో నింపాలి.

అప్లికేషన్, పరీక్ష ఫీజు:
అభ్యర్థి మీసేవ (ఈ సేవ) ఏపీ/ టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల్లో ఛైర్మన్ ఎస్ఎల్ పీఆర్‌బీ, ఏపీ పేరుతో నిర్దేశిత ఫీజు రూ.300 (ఎస్‌సీ, ఎస్‌టీలైతే రూ.150) చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ పోలీసు వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
State Level Police Recruitment Board (SLPRB), Andhra Pradesh (AP Police) invites Online applications from eligible candidates for recruitment of Police Constables and Warders for filling up total 4548 Vacancies. SLPRB, AP Online registration close on 14th September 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X