వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర: 11,696 పోస్టుల భర్తీకి చర్యలు: త్వరలో నోటిఫికేషన్...!

|
Google Oneindia TeluguNews

ఏపీలో అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అందించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ జనవరిలోనూ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని..ప్రతీ ఏడాది జనవరి ఉద్యోగాల భర్తీ మాసం గా అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అందులో భాగంగా వచ్చే జనవరిలో భర్తీ చేసే ఉద్యోగాల విషయంలో తొలుత ప్రజా సంబంధిత శాఖలు..ప్రజా సేవలకు సంబంధిం చిన సేవల పైన ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఆ మేరకు జాబితా సిద్దం చేస్తున్నారు.

అందులో ముఖ్యంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్సై..కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని పైన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే జనవరి నాటికి ఈ పోస్టులు భర్తీ చేసే విధంగా కార్యాచరణ సిద్దం అవుతోంది.

 మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...! మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...!

11,696 పోలీసు ఉద్యోగాల భర్తీ దిశగా..

ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం త్వరలో అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం 340 ఎస్సై, 11,356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇక పై అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రతీ జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా పోలీసు నియామక మండలి తమ శాఖలో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు అమలు చేస్తున్నారు.

AP Police Recruitment board submitted proposals for fill up of 11,696 vacancy posts to the govt

శాఖలో చాలా ఖాళీలు ఉండటంతో ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకు ఏపీలో రెండు సార్లు పోలీసుల ఉద్యోగాలను భర్తీ చేసారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం తో ప్రభుత్వం దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇతర శాఖలతో పాటుగానే పోలీసు ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తుందా..లేక ప్రత్యేకంగా నియామకానికి అనుతిస్తుందా అనేది ఇప్పుడు అధికారులు ఎదురు చూస్తున్నారు. దీంతో..పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటికే అభ్యర్ధులు శిక్షణ తీసుకోవటం ప్రారంభించారు.

జనవరిలో 40 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ..

ఇక, జనవరిలో ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ దిశగా షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం చేస్తోంది. పోలీసు శాఖతో పాటుగా ఇతర ప్రజా సంబంధిత శాఖల్లో తొలుత ప్రాధాన్యత క్రమంలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఏపీపీఎస్సీ పరీక్షల విధానంలోనూ మార్పులు తెస్తున్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేసారు. జనవరి లో నిర్వహించాల్సిన గ్రూపు పరీక్షల షెడ్యూల్ ను రివైజ్ చేసారు.

ఇక, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఐఐటీ, ఐఐఎం ల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో..జనవరి లో విడుదల చేసే ఉద్యోగాల క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే వాలంటీర్లు.. సచివాలయల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు అవకాశం కల్పించింది. ఇక, వచ్చే కేబినెట్ సమావేశంలో కొత్త ఉద్యోగాల భర్తీ పైన అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
AP Police Recruitemnt board submitted proposals for fill up of 11,696 vacancy posts to the govt. After govt approval ready to release schedule for these posts. Mostly in January process may be start.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X