వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: ఏపీ పోలీస్ శాఖలో 6,500 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్: హోంమంత్రి సుచరిత

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీకి జగన్ సర్కారు ఇకపై వినూత్న విధానాన్ని అవలంభించనుంది. ఉద్యోగాల నోటిఫికేష్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, నిర్దిష్టంగా జనవరి నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే 2021 ఏడాదికి సంబంధించి మొత్తం 6, 500 పోస్టులకుగానూ జనవరిలో నోటిఫికేషన్ రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఏపీ పోలీస్ విభాగంలో మరోసారి కొలువుల జాతరకు తెరలేవనుంది.

ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు -నాలుగు నెలల మౌనం వీడి నిప్పులు -నామినేటెడ్ సీఎం అంటూప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు -నాలుగు నెలల మౌనం వీడి నిప్పులు -నామినేటెడ్ సీఎం అంటూ

హోంమంత్రి ప్రకటన..

హోంమంత్రి ప్రకటన..


రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి 2021 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం రాత్రి వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆమె చెప్పారు. ఇకపై ప్రతి ఏటా జనవరి నెలలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ఈ మేరకు హోంమంత్రి తన అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేశారు. నిజానికి..

క్రికెటర్ నాగరాజు మళ్లీ బుసకొట్టాడు -ఈసారి మంత్రి కేటీఆర్ పీఏనంటూ -బ్యాటింగ్‌లో గిన్నిస్ రికార్డుక్రికెటర్ నాగరాజు మళ్లీ బుసకొట్టాడు -ఈసారి మంత్రి కేటీఆర్ పీఏనంటూ -బ్యాటింగ్‌లో గిన్నిస్ రికార్డు

రిక్రూట్మెంట్స్ క్యాలెండర్

రిక్రూట్మెంట్స్ క్యాలెండర్


పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేస్తామని ఇటీవల సీఎం జగన్ వెల్లడించారు. మిగతా అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అందజేయాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖతోపాటే అన్ని శాఖల ఉద్యోగాలకు ప్రతి ఏడాది జనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు పూర్తిచేసేలా రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపొందించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

Recommended Video

Tirupati LokSabha Bypoll | Oneindia Telugu
ఏపీ పోలీస్ శాఖలో భారీగా..

ఏపీ పోలీస్ శాఖలో భారీగా..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 2019 నవంబర్ నాటికి 340 ఎస్సై, 11,356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని పోలీసు నియామక మండలి అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. పోలీసు నియామక మండలి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ల విడుదలకు సరేనన్న ప్రభుత్వం.. తాజాగా వాటి గడువును కూడా ప్రకటించడం గమనార్హం.

English summary
andhra pradesh home minister Mekathoti Sucharitha made huge announcement on monday regarding jobs fulfilment in police department. minister says the notification for about 6,500 jobs willbe announced in january 2021. We will henceforth issue a notification for the recruitment of police posts in January every year, minister added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X