• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ ఎన్నికలలో ఫుల్ గా ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ ఏం చేస్తున్నారో తెలుసా?

|

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్‌టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాబోయే సీఎం తానేనని చెప్పుకున్న పాల్ సీరియస్ గా , చాలా ఉత్కంఠ గా సాగిన ఎన్నికల్లో నవ్వులను పూయించాడు. తన సంచలన వ్యాఖ్యలతో జనాల మతి పోగొట్టాడు . ఎప్పుడు ఎవరికి మద్దతిచ్చాడో, ఎందుకు తిట్టాడో కూడా అర్ధం కాకుండా చాలా ఫన్నీగా, అంతే వింతగా ఎన్నికల్లో సందడి చేశారు కేఏ పాల్.

నా ముందు వీళ్ళంతా బచ్చాలే అన్న పాల్ .. ఏపీ ఎన్నికల ఎంటర్‌టైనర్

నా ముందు వీళ్ళంతా బచ్చాలే అన్న పాల్ .. ఏపీ ఎన్నికల ఎంటర్‌టైనర్

ఏపీలో నాయకులంతా నా ముందు బచ్చాలే అని విలువ తీసి పారేసిన కేఏ పాల్ జగన్ మీద, వైసీపీ మీద మాత్రం మొదట నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. "చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా. జగన్ ఓ క్రిమినల్, పవన్ కళ్యాణ్ ను అయితే లెక్కలోకే తీసుకోను అంటూ వీరావేశంతో పలు సంచలన ఆరోపణలు చేసిన కేఏ పాల్ ప్రస్తుతం ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు ఏపీలో చర్చకు వస్తుంది. 'నేను ఒక్క నిమిషంలో కోటి రూపాయలు సంపాదించగలను, నా సమయం వృథా చేయొద్దని' ఓ టీవీ షో లో యాంకర్ పై ఫైర్ అయిన కేఏ పాల్ ఇప్పుడు ఒక్క నిముషం కూడా వృధా చెయ్యకుండా ఏం చేస్తున్నారో తెలుసా

ఆంధ్రప్రదేశ్ నుండి సాధారణ జీవితం గడిపేందుకు అమెరికా వెళ్ళిన పాల్

ఆంధ్రప్రదేశ్ నుండి సాధారణ జీవితం గడిపేందుకు అమెరికా వెళ్ళిన పాల్

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిశాక కేఏ పాల్ అమెరికా వెళ్ళారు. అక్కడ హ్యుస్టన్ లో గత ముప్పై సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని చూపించాడు. అయితే అది అతి సాధారణంగా కట్టెలతో కట్టిన ఇల్లని , అలాంటి ఇంటిలో ఉంటున్నానని తన సాధారణ జీవితాన్ని తాజాగా వీడియో ద్వారా పంపించిన కేఏ పాల్ అమెరికాలో ఒక్క నిముషం కూడా వృధా చెయ్యకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఏపీ ఎన్నికల్లో తన మార్ ఉంటుందని ప్రజాశాంతి పార్టీ సభ్యులకు పాల్ సందేశాలు

ఏపీ ఎన్నికల్లో తన మార్ ఉంటుందని ప్రజాశాంతి పార్టీ సభ్యులకు పాల్ సందేశాలు

అమెరికాలో ఉన్నప్పటికీ ఇక అప్పుడప్పుడు వెబ్ చాట్ ద్వారా ప్రజా శాంతి పార్టీ నేతలతో మాట్లాడుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారట. అంతే కాదు ఏపీ ఎన్నికల్లో విజయం ప్రజాశాంతి పార్టీదే అని చెప్తున్నారట . ఏపీలో ఎన్నికల్లో తన మార్క్ తప్పక ఉంటుందని చెప్తున్న పాల్ ఎన్నికల్లో కష్టపడ్డారు కనుక అమెరికా వెళ్లి మరీ అతి సాధారణంగా రెస్ట్ తీసుకుంటున్నారట. కేఏ పాల్ ఎన్నికల్లో చెప్పిన మార్క్ వుంటుందో లేదో కానీ ఎంటర్‌టైనర్ గా ఆయన మార్క్ మాత్రం అలాగే వుంటుంది. అది ఎవ్వరూ కాదనలేనిది .

English summary
Where is this political entertainer KA Paul after the elections got over? Paul has flown to the United States of America, where he's taking rest. However, he is regularly conducting web-chats with his teammates and encouraging them, saying that their party will make its mark in the 2019 election. Wonder what is that mark he's saying, but truly some of the votes that should go to YS Jagan and Pawan Kalyan are badly pipped by Paul we have to say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more