వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి రాజకీయాల్లో మలుపు: ఏ హీరో ఎటు, వారెటు? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన రాజకీయ ఎజెండాను ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కుదుపునకు గురయ్యాయి. తన సొంతంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు.

అదే సమయంలో వివిధ సినీ ప్రముఖులు 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారు. దానికితోడు, తెలుగుదేశం పార్టీ ఇతర సినీ ప్రముఖులకు గాలం వేసేందుకు సిద్ధపడింది. పవన్ కల్యాణ్‌తో పాటు చిరంజీవి, దాసరి నారాయణ రావు, మోహన్ బాబు వంటి సినీ ప్రముఖులు ఎపి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

దాంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పూర్తి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి దూరమైన జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో తనదైన ప్రాముఖ్యాన్ని చాటేందుకు ముందుకు రావచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా కొంత మంది సినీ ప్రముఖుల మద్దతు పొందే అవకాశాలున్నాయి.

పవన్ కల్యాణ్ సొంతంగా..

పవన్ కల్యాణ్ సొంతంగా..

వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బిత్తరపోయినట్లే కనిపిస్తున్నారు.

మహేష్ బాబు కోసం చంద్రబాబు

మహేష్ బాబు కోసం చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహేష్ బాబు మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సమీప బంధువు, పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ద్వారా ఆయన ఆ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినికిడి.

దాసరి నారాయణ రావు ఎటు....

దాసరి నారాయణ రావు ఎటు....

ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి దాసరి నారాయణ రావును కలిశారు. దాంతో దాసరి నారాయణ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.

మోహన్ బాబు జగన్ వైపేనా...

మోహన్ బాబు జగన్ వైపేనా...

మోహన్ బాబు త్వరలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. కానీ ఏ పార్టీలో చేరేది చెప్పలేదు. ఆయన వ్యాఖ్యలను బట్టి వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నారు.

మోడీతో సంబంధం..

మోడీతో సంబంధం..

మోహన్ బాబు కటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహత సంబంధాలున్నాయి. ఆయన బిజెపిలో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే సమయంలో బిజెపి జగన్‌తో కలిసి పని చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.

బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకే...

బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకే...

ప్రస్తుత శాసనసభ్యుడు, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం ఖాయం. ఆయన వచ్చే ఎన్నికల్లో తిరిగి శాసనసభకు పోటీ చేస్తారా, ఈ మధ్యలోనే రాజ్యసభకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు

జూనియర్ ఎన్టీఆర్ ఎటువైపు

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే బాలకృష్ణ మండిపోతున్నట్లు వినికిడి. అయితే, పవన్ కల్యాణ్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను తిరిగి టిడిపిలోకి తెచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

హరికృష్ణ అంగీకరిస్తారా...

హరికృష్ణ అంగీకరిస్తారా...

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ ముందుకు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను తిరిగి తెలుగుదేశం పార్టీతో కలపడానికి ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ అంగీకరిస్తారా అనేది అనుమానమే...

English summary
Political equatins may change in Andhra Pradesh with Jana Sena chief Pawan Kalyan and other cine persons, like Dasar Narayana Rao and Mohan Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X